మధ్యాహ్నం హత్య | Afternoon murder story | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం హత్య

Published Sun, Oct 9 2016 3:23 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

మధ్యాహ్నం హత్య - Sakshi

మధ్యాహ్నం హత్య

పట్టుకోండి చూద్దాం
అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు... సుబ్బారావుకు అతి సన్నిహితులైన మిత్రులు కూడా. అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న సుబ్బారావు... పాతికేళ్ల అమ్మాయి రాధను పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సుబ్బారావు భార్య చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకోమని బంధువులు, మిత్రులు ఒత్తిడి తెచ్చారు. ‘‘నా పెళ్లి సరే... ఆమె నా  బిడ్డల్ని బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకు లేదు.

అందుకే... పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాను’’ అంటూ పెళ్లి చేసుకోకుండా... తానే తల్లై  ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకున్నాడు సుబ్బారావు. ఏరోజూ ‘పెళ్లి’ అనే ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా?
 సుబ్బారావు పెళ్లిపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. కష్టాల్లో ఉన్న రాధను పెళ్లి చేసుకోవడానికే సుబ్బారావు పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు.
 కాదు... ఆరోగ్యం బాగ లేకపోవడం వల్ల... తనను చూసుకునేవారు ఎవరూ లేకపోవడం వల్ల... గత్యంతరం లేని పరిస్థితుల్లో రాధను పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు.
 
పేద అమ్మాయికి డబ్బు ఆశ చూపి... కేవలం తన స్వార్థం కోసం పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. లేదు... ఆస్తి మొత్తం కాజేయడానికి రాధ... ప్లాన్ ప్రకారమే సుబ్బారావుని పెళ్లిచేసుకుంది అంటారు కొందరు. ఎవరి అభిప్రాయం వారిది. ఏ అభిప్రాయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. అయితే వారి ఇంటికి వెళ్లిన వాళ్లు మాత్రం... సుబ్బారావుని రాధ పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని మెచ్చుకునేవాళ్లు. ఈరోజుల్లో... రాధలాంటి అమ్మాయిని చూడలేదని కూడా అనేవాళ్లు. సుబ్బారావు ఇద్దరు కొడుకులు మొదట్లో రాధతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ‘‘ఒకవేళ మీ అమ్మ బతికి ఉన్నా... రాధలా చూసుకొని ఉండేది కాదేమో’’ అని కూడా చాలా మంది చెప్పడంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది.  ఇక అప్పటి నుంచి... రాధను సొంతింటి మనిషిలా చూసుకునేవారు.

రాధ కోసం... ఆమె మేనమామ మంగపతి తరచుగా వచ్చిపోతుండేవాడు. ‘‘అమ్మా, నాన్న లేని రాధను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేశాను’’ అని అందరికీ చెబుతుంటాడు మంగపతి. ‘మంగపతి మోసగాడు. తాగుబోతు. డబ్బు కోసం రాధను వేధిస్తాడు’ అని ఎక్కువమంది చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని రాధ దగ్గర ఎవరో ప్రస్తావించినప్పుడు.. ఆమె ఏడ్చినంత పనిచేసింది. ‘‘మామయ్య అలాంటి వాడు కాదు... దేవుడు’’ అంది. ఒకసారి సుబ్బారావుకు యాక్సిడెంట్ జరిగి కాలు విరిగింది. కొద్ది నెలల తరువాత మాత్రం...క్రచ్ సహాయంతో నడవడం ప్రారంభించాడు.
 ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నం... ‘సుబ్బారావు చనిపోయాడు’ అనే వార్త అగ్గిలా వ్యాపించింది. ‘ఎలా చనిపోయాడటా?’ ‘మెట్లపై నుంచి జారి పడి’
    
సంఘటన స్థలికి హుటాహుటిన వచ్చాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. రాధ ఏడుస్తుంది... ఇన్‌స్పెక్టర్‌ను చూస్తూ... ‘‘మీకేదైనా పని ఉంటే పిలిచి నాకు చెప్పండి. మెట్లు దిగి వెళ్లొద్దు... అని తరచు చెప్పేదాన్ని. ఆయన నా మాట వినిపించుకునేవారు కాదు. ఈరోజు కూడా క్రచ్ సహాయంతో మెట్లు దిగి బ్యాలెన్స్ తప్పి మెట్ల మీది నుంచి దొర్లుతూ కింద పడిపోయారు. శబ్దం విని... నేను పరుగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చేలోపే ఆయన ప్రాణం పోయింది’’ అని చెప్పింది.
 
‘‘ఇది ప్రమాదం కాదు... హత్య!’’ అని గట్టిగా అన్నాడు ఇన్‌స్పెక్టర్. ఇన్‌స్పెక్టర్ చెప్పింది అక్షరాలా నిజమైంది. అది ప్రమాదం కాదు... హత్య!
 సుబ్బారావు ప్రమాదవశాత్తు చనిపోలేదని ఇన్‌స్పెక్టర్ ఎలా చెప్పగలిగాడు? క్లూ: స్టెయిర్స్ జ్చిఛీ ట్చజీ సుబ్బారావు కుడి చేతి వైపు ఉంది. ఎడమ చేయిని  మాత్రం ‘క్రచ్’ పట్టుకోవడానికి ఉపయోగించేవాడు.
 
Ans :
స్టెయిర్స్ కింద ఉన్న ఫ్లోర్‌పై బొక్కబోర్ల పడి ఉన్నాడు సుబ్బారావు. అయితే... ‘క్రచ్’ మాత్రం కుడి చేయి పక్కన పడి ఉంది. కుడిచేతికి ఆసరగా జ్చిఛీ ట్చజీ ఉండగా ‘క్రచ్’ వాడాల్సిన అవసరమే ఉండదు కదా! ఇంతకంటే అనుమానించాల్సిన విషయం ఏముంటుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement