శివ కంఠంనేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిగ్ బ్రదర్’. భోజ్‌పురిలో వరుస విజయాలతో ‘రాజమౌళి ఆఫ్ భోజ్‌పురి’గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా హెగ్డే హీరోయిన్‌గా నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా కీలక పాత్రలు పోషించారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ‘బిగ్ బ్రదర్’ చిత్రాన్ని నిర్మించారు.
కథ
‘బిగ్ బ్రదర్’ సినిమా అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో ఉంటుంది. శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియ హెగ్డే) పాత్రలతో కథ ప్రారంభమౌతుంది. వారిద్దరికీ నిశ్చతార్ధం జరిగి పదేళ్లు అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉంటారు. అలా వారి జీవితం సాగుతుండగా హైదరబాద్ నుంచి శివ సోదరుడు సూర్య (శ్రీ సూర్య) కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా అటాక్ జరుగుతుంది. అయితే, ఆ సమయంలో తమ్ముడిని కాపాడుతాడు శివ.. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల తనకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లవద్దని తమ్ముడికి చెబుతాడు శివ. కానీ, ఈ విషయంలో అన్న మాటలను లెక్క చేయకుండా తన వదినకు ఏవో నాలుగు మాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లూ ఉంటాడు.
ఆ సమయంలో పూజ (ప్రీతి) సూర్యకు పరిచయం అవుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడుతారు. ఒకసారి వారిద్దరిపైనా ఎటాక్ చేసేందుకు కొందరు రంగంలోకి దిగుతారు. వారిని ఆ ఇద్దరు బ్రదర్స్ తిప్పికొడతారు. కానీ, ఆ దాడి సూర్య మీద జరిగిందని శివ అనుకుంటాడు. వాస్తవానికి ఆ ఎటాక్ జరిగింది పూజ కోసం అని తర్వాత తెలుస్తోంది. ఇంతకీ పూజ ఎవరు..? ఆమెపై దాడి చేసేందుకు వచ్చిన వారు ఎవరు..? సూర్య, పూజల గతం ఏంటి..? నిశ్చితార్థం అయినా కూడా శివ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. పూజ కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అనేది తెలియాలంటే ‘బిగ్ బ్రదర్’ సినిమా రన్ అవుతున్న థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా ఉందంటే
చిన్న సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ కథను చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమా మొదటి భాగం అంతా కూడా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇద్దరి బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్‌తో పాటు వదినపై మరిది చూపించే గౌరవప్రదమైన ప్రేమ, నానమ్మతో మనుమడి అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాలో కామెడీ, ఫైట్స్ పాటలు కూడా మెప్పించేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉన్నా ఇంటర్వెల్ సీన్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఎంతో సరదగా సాగిన కథ సెకండాఫ్‌లోకి వెళ్తే.. అదే రేంజ్‌లో మెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు.అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ రావడంతో యూత్‌ను బాగా మెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు మంచి ఎంటర్‌టైన్ చేస్తాయి.
కాలేజ్ ఫ్లాష్ బ్యాక్‌తో పాటుగా ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కూడా మరోవైపు జరుగుతూ ఉంటుంది. శివ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందనే పాయింట్‌ను చాలా చక్కగా చూపించాడు. ఆ సమయంలో ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతారు. సినిమాలో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం చాలా చక్కగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే
శివ పాత్రలో శివ కంఠమనేని మెప్పించాడు. తనదైన స్టైల్లో ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కథకు తగ్గట్లు ప్రేమ, కోపం,సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించాడు. శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్య పాత్రే ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒకరకంగా కనిపించిన సూర్య.. సెకండాఫ్ వచ్చేసరికి మరోలా మెప్పిస్తాడు. పూజ పాత్రలో ప్రీతి గ్లామరస్‌గా మెప్పిస్తే.. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే కథకు తగ్గట్లు నటించింది. ఇందులోని సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు చూడటానికి బాగున్నప్పటికీ త్వరగా గుర్తిండిపోయేలా లేవు. కెమెరామెన్ స్థాయికి తగ్గట్లు పర్వాలేదనిపిస్తుంది. ఫైనల్‌గా బిగ్ బ్రదర్ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment