
సాక్షి, అనకాపల్లి: నాటక రంగాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న చిత్రం అంజి బాబు (71) అనే కళాకారుడు నాటికను ప్రదర్శించి.. తుది శ్వాస విడిచిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మకో ముద్దు నాటిక ప్రదర్శించారు. ఇందులో గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని అల్లూరివారి పాలేనికి చెందిన అంజి బాబు ముస్లిం పాత్రలో నటించారు. ప్రదర్శన ముగిసిన కొంతసేపటికి గుండెపోటుతో కుప్పకూలిపోగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా అతడు ప్రాణాలు వదిలాడు.
Comments
Please login to add a commentAdd a comment