సాక్షి,అనకాపల్లి: విశాఖ పరిపాలన రాజధాని అనేది భావితరాల కోసం జరిగే పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారని పేర్కొన్నారు. విశాఖ ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోరుకోవట్లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘మా దగ్గరకు వచ్చి మా ప్రాంతం నాశనం అయిపోవాలని కోరుకుంటారా. పాదయాత్ర పేరుతో వచ్చే వారిని తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. చెప్పులు చూపించమని, తొడలు కొట్టమని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మూడు రాజధానుల ఉద్యమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గాయపడితే ఆయనను హేళన చేస్తున్నారు. ఎమ్మెల్యేను అభిమానించే వాళ్ళు పాదయాత్రపై తిరగబడితే ఏం చేస్తారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేది సీఎం ఆలోచన’ అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
కాలగర్భంలో కలిసిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రథముడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రథముడని కొనియాడారు. మూడు రాజధానుల ఏర్పాటు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు. 29 గ్రామాల ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటే శాసన సభ ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు.
చదవండి: జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు
Comments
Please login to add a commentAdd a comment