మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో 'ఠాగూర్' ఓ క్లాసిక్. మరీ ముఖ్యంగా ఇందులో హాస్పిటల్ సీన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇదే సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకులు సర్వనాశనం అయిపోయాయని ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి అంటున్నారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.
(ఇదీ చదవండి: అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?)
'ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ వైద్య వృత్తికి చాలా నష్టం చేకూర్చారు. చెప్పాలంటే అది వరస్ట్ సీన్. అది చూసిన ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి'
'చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశారు. ఓ సందర్భంగా 'ఠాగూర్' సీన్ గురించి చెప్పా. డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పాను. అయితే అది ఇంకా దారుణంగా ఉందట. చిరంజీవిగారే దాన్ని కాస్త మార్పు చేశారు' అని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: దీపావళికి థియేటర్లలో అరడజను సినిమాలు.. కానీ!)
Comments
Please login to add a commentAdd a comment