Tagore movie
-
చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో 'ఠాగూర్' ఓ క్లాసిక్. మరీ ముఖ్యంగా ఇందులో హాస్పిటల్ సీన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇదే సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకులు సర్వనాశనం అయిపోయాయని ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి అంటున్నారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.(ఇదీ చదవండి: అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?)'ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ వైద్య వృత్తికి చాలా నష్టం చేకూర్చారు. చెప్పాలంటే అది వరస్ట్ సీన్. అది చూసిన ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి''చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశారు. ఓ సందర్భంగా 'ఠాగూర్' సీన్ గురించి చెప్పా. డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పాను. అయితే అది ఇంకా దారుణంగా ఉందట. చిరంజీవిగారే దాన్ని కాస్త మార్పు చేశారు' అని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: దీపావళికి థియేటర్లలో అరడజను సినిమాలు.. కానీ!) -
చిరంజీవితో ఉన్న పిల్లల్లో ఓ హీరోహీరోయిన్ ఉన్నారు.. కనిపెట్టారా?
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు మూడు జనరేషన్లని కవర్ చేసిన హీరో. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్లు ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించారు. అయితే కొన్నేళ్ల ముందు ఆయనతో నటించిన పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా అయిపోయారు. పైన ఫొటోలో ఉన్నది అలాంటి పిల్లలే. మరి వాళ్లు ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. పైన ఫొటో చిరంజీవి 'ఠాగూర్' సినిమాలోనిది. 2003 సెప్టెంబరు 24న రిలీజైన ఈ చిత్రం.. రీసెంట్‌గానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరు కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో చిరు పక్కనే కొందరు పిల్లలు కూడా యాక్ట్ చేశారు. వాళ్లలో పైన ఫొటోలో ఉన్న తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ ఇప్పుడు హీరోహీరోయిన్ అయిపోయారు. 'ఠాగూర్' సినిమా 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ పిక్ వైరల్ అయింది. అలా ఈ పిల్లల గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. బలగం, మసూద తదితర చిత్రాలతో లక్కీ బ్యూటీ అనిపించుకున్న కావ్య.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. పలు సినిమాల్లో హీరోగా చేసిన తేజ.. ప్రస్తుతం 'హనుమాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!) -
ఠాగూర్ సీక్వెల్ పై వివి వినాయక్ గొప్ప మాటలు
-
కామినేని ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్ వేయాలని వైద్యులు చేప్పడంతో వేయమని చెప్పామన్నారు. శివకృష్ణకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్ రాలేదని డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేస్తున్నామని వైద్యులు తెలిపారన్నారు. డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్‌కు తీసుకెళ్లామని బంధువుల పేర్కొనగా... రెండు రోజులుగా రోగిని బంధువులకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు. గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకుని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని కేవలం ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. కామినేని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు. -
నగరంలో మరో ‘ఠాగూర్’ ఘటన
నాగోలు: మృతి చెందిన వ్యక్తికి వైద్యం చేస్తూ డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ మతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడలోని గుదిబండ గ్రామానికి చెందిన కె.తులసిరెడ్డి ఛాతి నొప్పితో నాలుగు రోజుల క్రితం కొత్తపేటలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యుల నుంచి రూ.2 లక్షలను కట్టించుకుని శస్త్ర చికిత్స నిర్వహించి పరిస్థితి బాగానే ఉందని నమ్మించారు. తీరా శుక్రవారం మిగిలిన డబ్బులు కట్టించుకున్న తరువాత.. తులసిరెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆసుపత్రి డాక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గుండెనొప్పి రావడంతో తులసిరెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారని, శస్త్ర చికిత్స చేసి స్టంట్లు వేశామని, మెదడు మాత్రం సరిగా స్పందించడం లేదని, సరైన చికిత్స అందించామని అన్ని రికార్డులు ఉన్నాయని తెలిపారు. చైతన్యపురి సీఐ సమక్షంలో ఆసుపత్రి వర్గాలు అందించిన వైద్యం గురించి బంధువులకు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో బంధువులు చర్చలు జరపడంతో ఆందోళన సద్దుమణిగింది. -
చనిపోయిన వ్యక్తికి వైద్యం..
⇒చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుని బంధువుల ఆందోళన ⇒రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించి మోసం చేశారని మండిపాటు ⇒వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చీరాలలో ‘ఠాగూర్’ తరహా మోసం ఠాగూర్ చిత్రంలో ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఓ ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి మృతుని బంధువుల నుంచి వైద్యులు రూ.లక్షలు దండుకుంటారు. విషయాన్ని కథానాయకుడు గ్రహించి వైద్యుల గుట్టురట్టు చేస్తాడు. చీరాలలో అచ్చం అలాగే జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందించారు. బంధువులతో రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరకు గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆటో డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు.. ఇతడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులైందని చెప్పడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరొక్కసారి అందరూ ఠాగూర్ చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చీరాల : వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన గవిని నాగరాజు (30) పురుగుమందు తాగి గత నెల 20న ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అప్పులు పాలవడంతో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో పురుగుముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును చీరాలలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 15 రోజులు పాటు చికిత్స అందించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. గురువారం సాయంత్రం 3గంటల సమయంలో నాగరాజుకు సీరియస్‌గా ఉందని, గుంటూరు తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. నాగరాజు చనిపోయి రెండు రోజులైందని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుని బంధువులు, గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం చీరాల వచ్చి గడియారస్తంభం వద్ద ధర్నా చేశారు. వైద్యశాల అద్దాలు పగలగొట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. 15 రోజులు పాటు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు ప్రాణాలు పోగొట్టారని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సంఘటనపై వైద్యశాల డాక్టర్లు మాత్రం తమ తప్పు ఏమీలేదని, సక్రమంగా వైద్యం చేశామని, అవసరమైతే కేసు పెట్టుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం. విచారణ జరిపించండి : ఎమ్మెల్యే ఆమంచి నాగరాజు మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. ఆటో డ్రైవర్ మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని, వైద్యశాలను సీజ్ చేయాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగరాజు మృతదేహాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత పరిశీలించారు. మృతుని బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామన్నారు.