
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు మూడు జనరేషన్లని కవర్ చేసిన హీరో. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్లు ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించారు. అయితే కొన్నేళ్ల ముందు ఆయనతో నటించిన పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా అయిపోయారు. పైన ఫొటోలో ఉన్నది అలాంటి పిల్లలే. మరి వాళ్లు ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!)
అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. పైన ఫొటో చిరంజీవి 'ఠాగూర్' సినిమాలోనిది. 2003 సెప్టెంబరు 24న రిలీజైన ఈ చిత్రం.. రీసెంట్‌గానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరు కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో చిరు పక్కనే కొందరు పిల్లలు కూడా యాక్ట్ చేశారు. వాళ్లలో పైన ఫొటోలో ఉన్న తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ ఇప్పుడు హీరోహీరోయిన్ అయిపోయారు.
'ఠాగూర్' సినిమా 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ పిక్ వైరల్ అయింది. అలా ఈ పిల్లల గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. బలగం, మసూద తదితర చిత్రాలతో లక్కీ బ్యూటీ అనిపించుకున్న కావ్య.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. పలు సినిమాల్లో హీరోగా చేసిన తేజ.. ప్రస్తుతం 'హనుమాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!)
Comments
Please login to add a commentAdd a comment