మరో వారం-పది రోజుల్లో దీపావళి పండగ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ బాంబుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ దీపావళికి మహా అయితే ఒకటో రెండో సినిమాలు రిలీజయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఏకంగా అరడజనుకి పైగా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో కొన్నింటిపై మాత్రం బజ్ ఉంది. అసలు ఈ సినిమాలేంటి? వీటి సంగతేంటి?
దీపావళికి రిలీజ్ అవుతున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దుల్కర్ సల్మాన్ హీరో కావడం, డిఫరెంట్ స్టోరీ కావడం కలిసొస్తుందని నిర్మాతల నమ్మకం. కిరణ్ అబ్బవరం 'క' మూవీలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథ ఉంది. ఈ రెండింటిపైన సోషల్ మీడియాలోనూ కొంచెం బజ్ ఉంది.
(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)
డబ్బింగ్ బొమ్మల విషయానికొస్తే శివకార్తికేయన్-సాయిపల్లవి 'అమరన్' ఉన్నంతలో మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కావడం దీనికి ఓ కారణం. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కథ అందించిన 'బఘీర' కూడా ఇప్పుడు రిలీజ్ పెట్టుకుంది. దీని గురించి పెద్దగా జనాలు ఇంకా రిజిస్టర్ కాలేదు.
'బ్లడీ బెగ్గర్' అనే మరో తమిళ మూవీ కూడా దీపావళి రేసులో ఉంది. పలువురు తెలుగు యాక్టర్స్ ఇందులో నటించారు. కానీ ఇప్పటివరకు తెలుగులో డబ్ చేయడం గురించి ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ చేస్తే మాత్రం కౌంట్ పెరిగినట్లే. ఇవన్నీ కాదన్నట్లు 'భూల్ భులయ్యా 3', 'సింగం ఎగైన్' అనే హిందీ మూవీస్ కూడా నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో హిట్ అయి 'దీపావళి' విన్నర్ ఏదవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)
Comments
Please login to add a commentAdd a comment