Bagheera Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'మెకానిక్ రాకీ', 'జీబ్రా', 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఒక్కరోజే ఏకంగా 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2, 'లగ్గం' సినిమా కొంతలో కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో ఇంకా ఏమేం వచ్చాయంటే?(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ)ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్-వెబ్ సిరీస్ (నవంబర్ 22)నెట్ఫ్లిక్స్దేవర - హిందీ వెర్షన్ మూవీ900 డేస్ వితౌట్ అన్నాబెల్ - స్పానిష్ సిరీస్జాయ్ - ఇంగ్లీష్ సినిమాపోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 - జపనీస్ సిరీస్కాంకర్: లహద్ దతూ - మలయ్ సినిమాస్పెల్ బౌండ్ - ఇంగ్లీష్ మూవీద హెలికాప్టర్ హెయిస్ట్ - స్వీడిష్ సిరీస్వెన్ ద ఫోన్ రింగ్స్ - కొరియన్ సిరీస్ద పియానో లెసన్ - ఇంగ్లీష్ సినిమాట్రాన్స్మిట్హ్ - స్పానిష్ మూవీఏ మ్యాన్ ఆన్ ద ఇన్సైడ్ - ఇంగ్లీష్ సిరీస్యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 - హిందీ సిరీస్ద ఎంప్రెస్ సీజన్ 2 - జర్మన్ సిరీస్బఘీరా - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్హంటింగ్ విత్ టైగర్స్ - ఫ్రెంచ్ సినిమావ్యాక్ గర్ల్స్ - హిందీ సిరీస్పింపినెరో - స్పానిష్ మూవీద రానా దగ్గుబాటి షో - తెలుగు టాక్ షో (నవంబర్ 23)ఆహాఅన్స్టాపబుల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 - తెలుగు టాక్ షోలగ్గం - తెలుగు సినిమాలైన్ మ్యాన్ - తమిళ మూవీహాట్స్టార్బియా & విక్టర్ - పోర్చుగీస్ సిరీస్ఔట్ ఆఫ్ మై మైండ్ - ఇంగ్లీష్ సినిమాతుక్రా కే మేరా ప్యార్ - హిందీ సిరీస్జియో సినిమాబేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 23మనోరమ మ్యాక్స్తెక్కు వడక్కు - మలయాళ మూవీసీక్రెట్ - మలయాళ సినిమా (నవంబర్ 24)ఆపిల్ ప్లస్ టీవీబ్లిట్జ్ - ఇంగ్లీష్ మూవీబ్రెడ్ అండ్ రోజెస్ - అరబిక్ సినిమాబుక్ మై షోఫ్రమ్ డార్క్నెస్ - స్వీడిష్ సినిమాద గర్ల్ ఇన్ ద ట్రంక్ - ఇంగ్లీష్ మూవీద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ - స్పానిష్ సినిమాలయన్స్ గేట్ ప్లేగ్రీడీ పీపుల్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: Mechanic Rocky Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?) -
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?
దేశవ్యాప్తంగా దీపావళిని అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాణా సంచా వెలుగులతో కళకళాలాడిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల కూడా ప్రేక్షకుల కేరింతలతో సందడి చేశాయి. ఈ పండగ సందర్భంగా ఏకంగా నాలుగు మూవీస్ రిలీజయ్యాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్'తో పాటు కన్నడ డబ్బింగ్ మూవీ 'బఘీర' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. ఇంతకీ వీటిలో దీపావళి విన్నర్ ఎవరు? ఏది ఎలా ఉందంటే?'లక్కీ భాస్కర్' చాలా లక్కీమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి యునిక్ కాన్సెప్ట్ కావడం బాగా కలిసొచ్చింది. దీంతో ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ బయటకు వచ్చింది. ఆద్యంతం థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేసేయండి) డిఫరెంట్ అటెంప్ట్ 'క'బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతంలో ఏడాదికి రెండు మూడు మూవీస్‌తో వచ్చాడు. కాకపోతే అవి రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో ఏడాదిన్నర టైమ్ తీసుకుని, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'క'తో వచ్చాడు. దీనికి కూడా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?)ఏడిపించేసిన 'అమరన్'కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేశారు. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). బ్యాట్‌మ్యాన్ తరహా కథతో 'బఘీర'ప్రశాంత్ నీల్ అందించిన కథతో తీసిన కన్నడ సినిమా 'బఘీర'. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళికి తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే పైన మూడింటికి వచ్చినంత స్పందన అయితే రాలేదు. హీరో పోలీస్. కానీ వ్యవస్థ పనితీరు వల్ల రాత్రి వేళలో ముసుగు వేసుకుని మరీ విలన్లని చెండాడుతుంటాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) -
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
శ్రీ మురళి హీరోగా డా. సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బఘీర’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు డా. సూరి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల రైటింగ్ విభాగంలో నేనూ ఉన్నాను. శ్రీ మురళిగారితో నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు కథ కుదర్లేదు. అప్పుడు తన దగ్గర కథ ఉందని ప్రశాంత్ నీల్గారు చెప్పడంతో ‘బఘీర’ చిత్రం ప్రారంభమైంది. సూపర్ హీరో అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి ప్రశాంత్ నీల్గారు హ్యాపీ ఫీలయ్యారు. శ్రీ మురళి బాగా నటించారు. ‘బఘీర’ను ‘కేజీఎఫ్’తో ΄ోల్చి మాట్లాడుతున్నారు. ‘బఘీర’ సినిమా ‘కేజీఎఫ్’ టోన్‌లో ఉండదు. ‘కేజీఎఫ్’ చరిత్రలాంటి సినిమా. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం యశ్‌తో ఓ సినిమా చేశాను (‘లక్కీ’). ఆ తర్వాత యశ్‌తో ట్రావెల్ అయ్యాను. యశ్ కథలను నేనే వినేవాడిని. అయితే యశ్‌తో నేను అనుకున్న సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ వల్ల యశ్‌కు చాలా సమయం పట్టింది. దీంతో నేను శ్రీ మురళితో ‘బఘీర’ చేశాను’’ అని తెలి΄ారు. -
ఆ డైట్ చాలా సవాల్‌గా అనిపించింది: శ్రీ మురళి
‘‘మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో నా భార్య, అత్తగారు తెలుగే మాట్లాడతారు... అందుకే నాకు కూడా తెలుగు వస్తుంది. తెలుగులో విడుదలవుతున్న నా మొదటి సినిమా ‘బఘీర’. దేశమంతా చూడదగ్గ మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రమిది. అందుకే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అని కన్నడ హీరో శ్రీమురళి అన్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీ మురళి, రుక్షిణీ వసంత్ జంటగా నటించారు. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ కన్నడ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ‘బఘీర’ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ మురళి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి కథని సూరిగారు వంద శాతం అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ‘బఘీర’ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్లో నాకు గాయాలైనా పట్టించుకోలేదు. నాకు నా సినిమానే ముఖ్యం. నేను ఫుడ్ లవర్ని. ఈ సినిమా కోసం మూడేళ్లు లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా సవాల్‌గా అనిపించింది. ‘ఉగ్రం 2’ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
దీపావళికి థియేటర్లలో అరడజను సినిమాలు.. కానీ!
మరో వారం-పది రోజుల్లో దీపావళి పండగ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ బాంబుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ దీపావళికి మహా అయితే ఒకటో రెండో సినిమాలు రిలీజయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఏకంగా అరడజనుకి పైగా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో కొన్నింటిపై మాత్రం బజ్ ఉంది. అసలు ఈ సినిమాలేంటి? వీటి సంగతేంటి?దీపావళికి రిలీజ్ అవుతున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దుల్కర్ సల్మాన్ హీరో కావడం, డిఫరెంట్ స్టోరీ కావడం కలిసొస్తుందని నిర్మాతల నమ్మకం. కిరణ్ అబ్బవరం 'క' మూవీలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథ ఉంది. ఈ రెండింటిపైన సోషల్ మీడియాలోనూ కొంచెం బజ్ ఉంది.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)డబ్బింగ్ బొమ్మల విషయానికొస్తే శివకార్తికేయన్-సాయిపల్లవి 'అమరన్' ఉన్నంతలో మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కావడం దీనికి ఓ కారణం. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కథ అందించిన 'బఘీర' కూడా ఇప్పుడు రిలీజ్ పెట్టుకుంది. దీని గురించి పెద్దగా జనాలు ఇంకా రిజిస్టర్ కాలేదు.'బ్లడీ బెగ్గర్' అనే మరో తమిళ మూవీ కూడా దీపావళి రేసులో ఉంది. పలువురు తెలుగు యాక్టర్స్ ఇందులో నటించారు. కానీ ఇప్పటివరకు తెలుగులో డబ్ చేయడం గురించి ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ చేస్తే మాత్రం కౌంట్ పెరిగినట్లే. ఇవన్నీ కాదన్నట్లు 'భూల్ భులయ్యా 3', 'సింగం ఎగైన్' అనే హిందీ మూవీస్ కూడా నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో హిట్ అయి 'దీపావళి' విన్నర్ ఏదవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)