మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Latest Film Bagheera Streaming In Ott From This Date | Sakshi

Ott Release: ఓటీటీకి ప్రశాంత్ నీల్ సినిమా.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్!

Nov 20 2024 3:26 PM | Updated on Nov 20 2024 4:26 PM

Latest Film Bagheera Streaming In Ott From This Date

'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ  సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్‌ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement