ఇకపై సలార్ పాన్ ఇండియా కాదు.. అంతకు మించి! | Prabhas Salaar Movie Gets Another Record In Global Wide | Sakshi
Sakshi News home page

Prabhas Salaar Movie: ప్రభాస్ సలార్ మరో ఘనత.. ఏకంగా ఆ లిస్ట్‌లో చోటు!

Published Wed, Jan 24 2024 7:52 PM | Last Updated on Wed, Jan 24 2024 8:27 PM

Prabhas Salaar Movie Gets Another Record In Global Wide - Sakshi

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్‌ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్‌ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.  అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్‌ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలో టాప్‌-10లో నిలిచిన నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. త్వరలోనే ఈ సినిమాను ఇంగ్లీష్‌ భాషలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పాన్ ఇండియా మూవీ సలార్‌.. ఇప్పుడు గ్లోబల్‌ మూవీగా మారిపోయిందంటూ క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement