డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది నిజంగా సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనీసం థియేటర్లలోకి వచ్చి నెల రోజులైనా పూర్తి కాకుండానే ఇలా ఓటీటీల్లోకి వచ్చేయడం.. అభిమానులకు షాకింగ్‌గా అనిపించింది. మరోవైపు సగటు మూవీ లవర్ మాత్రం పండగ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ చాలామంది చూసేశాడు కూడా. అయితే ఓ చోట మాత్రం 'సలార్' ఓటీటీలో రిలీజ్ కాలేదు. దీనికి కారణమేంటో తెలుసా?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?)
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' సినిమా.. డిసెంబరు 22న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.700 కోట్ల మేర సొంతం చేసుకుంది. ఇంకా పలుచోట్ల స్క్రీన్ అవుతున్న ఈ చిత్రం.. తాజాగా అంటే జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ హిందీ వెర్షన్ మాత్రం రిలీజ్ కాలేదు.
సాధారణంగా స్ట్రెయిట్ లేదా డబ్బింగ్ సినిమా ఏదైనా సరే ఉత్తరాదిలోనే మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేయాలంటే ఎనిమిది వారాల థియేట్రికల్ రూల్ తప్పనిసరి. అంటే మల్టీప్లెక్సుల్లో విడుదల చేసిన సినిమాని కచ్చితంగా 8 వారాల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనిబట్టి చూస్తే ఓటీటీలో 'సలార్' హిందీ వెర్షన్ రిలీజ్ మరో నెల తర్వాతే ఉండొచ్చు. అంటే బాలీవుడ్ ఆడియెన్స్ 'సలార్' చూడాలంటే మరో నెలరోజుల ఆగాల్సిందే లేదంటే మిగతా భాషల్ని సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడటమే!
(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment