పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ ప‍్రకటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే పలుమార్లు థియేటర్‌లో సలార్‌ను చూసిన అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక శుభవార్త చెప్పింది. 'సలార్'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
వాస్తవంగా గణతంత్రదినోత్సవం రోజున ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించిన రీతిలో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ చేసింది. ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్‌కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలెంట్ తోడు కావడంతో ఈ సినిమా బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సలార్‌కు పార్ట్-2 కూడా ఉంటుందని చిత్ర మేకర్స్ ప్రకటించారు.
(ఇదీ చదవండి: ‘సలార్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment