తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంక్రాంతి హడావుడి గట్టిగా నడుస్తోంది. మరోవైపు పండగ బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కాగా, చాలామందికి 'హనుమాన్' గట్టిగా నచ్చేసింది. దీని తర్వాత 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' చూస్తున్నారు. వీటితోపాటే డిసెంబరు చివర్లో వచ్చిన 'సలార్' కూడా ఇంకా థియేటర్లలో అక్కడక్కడా స్క్రీన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ 'సలార్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)
'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలైతే చేస్తున్నాడే గానీ సరైన హిట్ అయితే పడలేదు. దీంతో అందరూ 'సలార్'పై అంచనాలు బాగా పెట్టుకున్నారు. వాటిని అందుకోవడంలో కాస్త తడబడింది గానీ ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ రన్ పూర్తయ్యేటప్పటికి రూ.800 కోట్ల మార్క్ దాటేయొచ్చు.
ఇకపోతే 'సలార్' డిజిటల్ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ‍్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా మరోసారి ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత అనే అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఈ తేదీకి కుదరకపోతే ఫిబ్రవరి 9న ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరో వారంలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అప్పటివరకు వెయిట్ అండ్ సీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?)
The people of Khansaar can begin their celebrations. Their Salaar has returned to his kingdom.👑#Salaar is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/iSuNbKHjNv
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
Comments
Please login to add a commentAdd a comment