ఓటీటీలో యానిమల్ దూకుడు.. మూడు రోజుల్లోనే సలార్‌ రికార్డ్‌ బ్రేక్! | Sandeep Reddy Animal Movie Crossed Salaar Views In Netflix | Sakshi
Sakshi News home page

Animal Movie On Netflix: సలార్‌ను దాటేసిన యానిమల్.. కేవలం మూడు రోజుల్లోనే!

Published Wed, Jan 31 2024 7:56 PM | Last Updated on Wed, Jan 31 2024 8:07 PM

Sandeep Reddy Animal Movie Crossed Salaar Views In Netflix - Sakshi

గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ షేక్‌ చేసిన సినిమా యానిమల్. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం జనవరి 26న ఓటీటీకి వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచే సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.

అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన యానిమల్ వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. అంతకుముందే రిలీజైన ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ మూవీ సలార్‌ను అధిగమించింది. కేవలం టాప్ ట్రెండింగ్ ఉన్న సినిమాలే కాదు.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్‌ మూవీస్‌ లిస్ట్‌లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఇండియాతో పాటు దాదాపు 16 దేశాల్లో నంబర్‌వన్‌ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కమర్షియల్ యాక్షన్ మూవీ సలార్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత జనవరి 20న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సలార్‌ ఇండియా వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. 

సలార్‌ను దాటేసిన యానిమల్..

టాప్ ట్రెండింగ్ మూవీస్‌లోనే కాదు.. వ్యూస్ విషయంలోనూ సలార్‌కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసింది.  కాగా.. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్‌తో పాటు 10.3 మిలియన్ గంటల వ్యూయర్‌షిప్‌ నమోదు చేసింది. దీంతో ఓటీటీలో సలార్‌కు  రణ్‌బీర్ కపూర్ యానిమల్ గట్టి పోటీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement