దేశవ్యాప్తంగా దీపావళిని అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాణా సంచా వెలుగులతో కళకళాలాడిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల కూడా ప్రేక్షకుల కేరింతలతో సందడి చేశాయి. ఈ పండగ సందర్భంగా ఏకంగా నాలుగు మూవీస్ రిలీజయ్యాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్'తో పాటు కన్నడ డబ్బింగ్ మూవీ 'బఘీర' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. ఇంతకీ వీటిలో దీపావళి విన్నర్ ఎవరు? ఏది ఎలా ఉందంటే?
'లక్కీ భాస్కర్' చాలా లక్కీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి యునిక్ కాన్సెప్ట్ కావడం బాగా కలిసొచ్చింది. దీంతో ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ బయటకు వచ్చింది. ఆద్యంతం థ్రిల్లింగ్, ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేసేయండి)
డిఫరెంట్ అటెంప్ట్ 'క'
బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతంలో ఏడాదికి రెండు మూడు మూవీస్‌తో వచ్చాడు. కాకపోతే అవి రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో ఏడాదిన్నర టైమ్ తీసుకుని, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'క'తో వచ్చాడు. దీనికి కూడా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?)
ఏడిపించేసిన 'అమరన్'
కశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేశారు. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
బ్యాట్‌మ్యాన్ తరహా కథతో 'బఘీర'
ప్రశాంత్ నీల్ అందించిన కథతో తీసిన కన్నడ సినిమా 'బఘీర'. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళికి తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే పైన మూడింటికి వచ్చినంత స్పందన అయితే రాలేదు. హీరో పోలీస్. కానీ వ్యవస్థ పనితీరు వల్ల రాత్రి వేళలో ముసుగు వేసుకుని మరీ విలన్లని చెండాడుతుంటాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment