‘‘మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో నా భార్య, అత్తగారు తెలుగే మాట్లాడతారు... అందుకే నాకు కూడా తెలుగు వస్తుంది. తెలుగులో విడుదలవుతున్న నా మొదటి సినిమా ‘బఘీర’. దేశమంతా చూడదగ్గ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూ΄పొందిన చిత్రమిది. అందుకే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అని కన్నడ హీరో శ్రీమురళి అన్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీ మురళి, రుక్షిణీ వసంత్ జంటగా నటించారు.
హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ కన్నడ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ‘బఘీర’ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ మురళి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్‌గారి కథని సూరిగారు వంద శాతం అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ‘బఘీర’ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్‌లో నాకు గాయాలైనా పట్టించుకోలేదు. నాకు నా సినిమానే ముఖ్యం. నేను ఫుడ్ లవర్‌ని. ఈ సినిమా కోసం మూడేళ్లు లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా సవాల్‌గా అనిపించింది. ‘ఉగ్రం 2’ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment