ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం: నాగార్జున | Akkineni Nagarjuna Invites Chiranjeevi For ANR National Award 2024 Ceremony, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం

Oct 26 2024 3:28 AM | Updated on Oct 26 2024 9:42 AM

Akkineni Nagarjuna Invites Chiranjeevi For ANR National Award 2024 Ceremony

దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఇస్తున్న ‘ఏఎన్‌ఆర్‌’ అవార్డు వేడుకని ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 20న ఏఎన్‌ఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ఏఎన్‌ఆర్‌’ అవార్డుని హీరో చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున పేర్కొన్న విషయమూ తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం చిరంజీవిని కలిసిన నాగార్జున అవార్డు వేడుకకి రావాలంటూ ఆహ్వానించారు.

‘‘మా నాన్న ఏఎన్‌ఆర్‌గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఈ అవార్డు వేడుకకి అమితాబ్‌ బచ్చన్‌గారు, చిరంజీవిగారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం’’ అంటూ తన సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు నాగార్జున.

 ఈ అవార్డు ప్రదానోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటివరకూ దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతీ మాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమ మాలిని, శ్యామ్‌ బెనెగల్, అమితాబ్‌ బచ్చన్, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలు ‘ఏఎన్‌ఆర్‌’ అవార్డును అందుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement