
పెదకాపు చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది

అభిషేక్ నామా దర్శకత్వంలో 'నాగబంధం ది 'సీక్రెట్ ట్రెజర్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు

ఈ చిత్రం పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర నటుడు చిరంజీవి హీరో హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు

దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
















