తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)
అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.
స్నేహం కోసం చెన్నై..
ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్‌లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది.
దీంతో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment