ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌‌పై బన్నీ | Allu Arjun Comments Chiranjeevi Bonding Unstoppable 4 Show Latest | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఓవైపు మెగా vs అల్లు.. బన్నీ మాత్రం చిరు గురించి!

Published Fri, Nov 22 2024 10:29 AM | Last Updated on Fri, Nov 22 2024 10:34 AM

Allu Arjun Comments Chiranjeevi Bonding Unstoppable 4 Show Latest

అల్లు vs మెగా అనేది ఏమవుతుందనేది ఎవరికీ తెలీదు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయమై ఇరువురు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ టైంలోనూ మెగా హీరోలు సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

'పుష్ప 2' ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్.. 'అన్‌స్టాపబుల్ 4' షోలో పాల్గొన్నాడు. గతవారం తొలిపార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు (నవంబర్ 22) ఇంటర్వ్యూలో రెండో పార్ట్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో బన్నీ పిల్లలు అయాన్-అర్హ కూడా కాసేపు కనిపించారు. ఇక ఓ సందర్భంగా చిరంజీవి గురించి చర్చ రాగా.. అల్లు అర్జున్ డీటైల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

'గత ఇరవై ఏళ్లుగా నాకు చిరంజీవితో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కానీ అంతకుముందు ఇరవై ఏళ్లు ఆయనతో నా బాండింగ్ ఎలా ఉందో ఎప్పుడూ చెప్పుకొనే సందర్భం రాలేదు. కాబట్టి ఇప్పుడు పంచుకుంటాను. ఓ మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్‌కి అభిమానిగా మారాను. నేను చిన్నగా ఉన్నప్పుటి నుంచి మామయ్య ప్రభావం నాపై చాలా ఉంది. ఎందుకంటే అప్పట్లో విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఆ టైంలో చిరంజీవి ఆయన పిల్లలతో పాటు నన్ను, శిరీష్‌ని కలిసి మొత్తం 10 మందికి పైగా పిల్లల్ని ఫారిన్ ట్రిప్‌కి తీసుకెళ్లేవారు. అప్పట్లో అది చాలా గొప్ప విషయం' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

ఇలా చిరంజీవి గురించి బన్నీ ఇంతలా చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరి అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది పక్కనబెడితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement