హీరో చిరంజీవి మెగా స్పీడ్‌తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఆయన నెక్ట్స్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందని, షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్‌కు వెళ్తుందని సమాచారం.
ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని సినిమా సెట్స్‌లో చిరంజీవి జాయిన్ అవుతారని తెలిసింది. అలాగే తనతో ‘గాడ్‌ఫాదర్’ సినిమా తీసిన దర్శకుడు మోహన్‌రాజాతో సినిమాకి కూడా చిరంజీవి పచ్చ జెండా ఉపారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇంకా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని, ఆయన ప్రస్తుతానికి కమిటైన సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, చిరంజీవి–సందీప్ కాంబో లోని సినిమా ప్రకటన ఉండొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment