
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు.

తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్ ఆశీర్వదంచారు.

దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

5. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి.

తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది.

బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, అల్లు శీరిష్ పాల్గొన్నారు.

నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




