‘పెదకాపు’ చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’ అనే సినిమా ఆరంభమైంది. ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ ఇతర పాత్రలు పోషించనున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ ‡్ష నామా సమర్పణలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ సోమవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తొలి సన్నివేశానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. నిర్మాత సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 23 నుంచిప్రారంభిస్తున్నాం.
2025లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఆ నేపధ్యంలో ఈ చిత్ర కధ ఉంటుంది’’ అని అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తారక్ సినిమాస్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, సీఈఓ: వాసు పోతిని, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అభినేత్రి జక్కల్.
Comments
Please login to add a commentAdd a comment