
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష స్థానానికి ఆర్.వినోద్‌రెడ్డి, సి.దామోదర్‌రెడ్డి, పొన్నం అశోక్‌గౌడ్, మద్దిరెడ్డి శంకర్ పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష స్థానానికి ఆరుగురు పోటీ చేస్తున్నారు. కార్యదర్శుల పోస్టుల బరిలో ఐదుగురు ఉన్నారు. వీరిలో నుంచి ఇద్దరు కార్యదర్శులుగా ఎన్నికవుతారు. సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పోస్టులకు సైతం పలువురు పోటీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఎన్నిక జరుగుతుంది.