
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నాయీ బ్రాహ్మణ అడ్డకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైకోర్టు అడ్వకేటు మద్దికుంట లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కర్మాన్‌ఘాట్‌లోని జస్టిస్ వేణుగోపాలరావు కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో న్యాయవాదులు సీఎల్‌ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందుకు కమ్యూనిటీ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్థానని పేర్కొన్నారు. మద్దికుంట లింగం గతంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment