30న దేశ వ్యాప్త రవాణా సమ్మె | On 30 nationwide transport strike | Sakshi
Sakshi News home page

30న దేశ వ్యాప్త రవాణా సమ్మె

Published Wed, Apr 22 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

On 30 nationwide transport strike

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు-2015ను తిప్పి కొట్టాలని పలు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. రవాణా రంగ రక్షణ కోసం జాతీయ ఫెడరేషన్స్, అసోసియేషన్స్, స్వతంత్ర సంఘాలు ఉమ్మడిగా ఈ నెల 30న రోడ్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త రవాణా సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం జరిగింది. 

దేశ రవాణా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తుందని విమర్శించారు. సేప్టీ బిల్లు రూపంలో తీసుకువస్తున్న ఈ బిల్లు పూర్తిగా వాహన చోదకులకు బారంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో బీఎంఎస్  నేత రవిశంకర్, హెచ్‌ఎంఎస్ నాయకులు నర్సింహా, రాజిరెడ్డి, సీఐటీయూ నాయకులు భూపాల్, వీఎస్ రావు, ఐఎఫ్‌టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement