కడప అగ్రికల్చర్ : మేడేను పురస్కరించుకుని కడపలోని ప్రధాన రహదారులు ఎరుపెక్కాయి. శుక్రవారం సాయంత్రం కడప నగరంలో ట్రేడ్ యూనియన్లు ర్యాలీలు నిర్వహించాయి. సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అనుబంధ సంఘాలతో కార్పొరేషన్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి వరకు డప్పు వాయిద్యాలు, కర్ర విన్యాసాలతో ఆయా సభా స్థలాలకు చేరుకున్నారు. మహిళలు ఎర్ర చీరెలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ట్రేడ్ యూనియన్ల జెండాలతో కార్మికులు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీలో కార్మిక గీతాలను ఆలపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, ఐఎన్‌సుబ్బమ్మ, రాజకుళ్లాయమ్మ, రామలక్షుమ్మ, లక్ష్మిదేవి, మనోహర్, సిద్దిరామయ్య, పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఓ.శివశంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎరుపెక్కిన కడప దారులు
Published Sat, May 2 2015 2:32 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement