చెన్నై: దాదాపు 4.5లక్షల మంది టెకీలకు నిలయమైన చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం టెకీలు కూడా యూనియన్లను స్థాపించుకోవచ్చని ప్రకటించింది. కార్మిక సంఘాలు వేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చిన ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. 1947 పారిశ్రామిక వివాదాలు యాక్ట్ కింద టెకీ ఉద్యోగులు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకుని తన బాధలను వ్యక్తం చేయోచ్చని తెలిపింది.
కాగా, ఐటీ సెక్టార్ ఈ ప్రకటనను విపరిణామంగా భావిస్తోంటే.. యూనియన్లు మాత్రం ఇది ఉద్యోగుల పాలిట వరంగా భావిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లను స్థాపించుకోవడం ఉద్యోగుల హక్కు అని కొంతమంది యూనియన్ల ప్రతినిధులు అంటున్నారు. హెచ్ సీఎల్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సరిగా పనిచేయడం లేదని గతనెలలో తీసేయగా.. మద్రాసు హైకోర్టు ఉద్యోగిని ఉన్నపళంగా తీసేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఒక పని చేసే వ్యక్తేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఏవరినైనా ఉద్యోగంలో తీసుకున్న తర్వాత వర్క్ మాన్ షిప్ నుంచి ఉన్నపళంగా తప్పించలేరని తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఫ్యాక్టరీలకే పరిమితమైన ట్రేడ్ యూనియన్లు టెకీ కంపెనీల్లో కూడా ఆరంభం కానున్నాయి.