తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : వేతనాల పెంపు, ఇతర డిమాండ్లతో జిల్లాలోని మునిసిపల్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో కార్మికుల సమ్మె ఆదివారం 10వ రోజుకు చేరింది. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో ఆయా పట్టణాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చేయి దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది. కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ఇదిలావుండగా, తాడేపల్లిగూడెంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కర్రి నాగేశ్వరరావు, ధనాల వెంకట్రావు, బోడా భోగిరాజు, కాటమరాజు, విజయకుమార్, తాటికొండ శ్రీనివాసరావు, అల్లం రాము, మండెల్లి రామకృష్ణ, కొడమంచిలి ముత్యం, అల్లం నరేంద్రకుమార్ పాల్గొన్నారు.
సమ్మెలోనే మునిసిపల్ కార్మికులు
Published Mon, Jul 20 2015 3:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement