workplace
-
సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..
పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా సహోద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు..వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్‌లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్‌కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్‌లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
పని ఒత్తిడి పనిపడదాం..!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది. ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం. హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
టెక్నాలజీతో సాధికారత
హైదరాబాద్:సర్వత్రా టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు వృద్ధి కోసం సాంకేతికతపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) పనిప్రదేశాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్పునకు కారకులయ్యేలా టెక్నాలజీతో ప్రజలకు సాధికారత లభించగలదని వివరించారు. ఎస్‌హెచ్‌ఆర్‌ఎంఐ టెక్23 కాన్ఫరెన్స్, ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. (బీర్‌తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!) సదస్సు రెండో రోజున హెచ్ఆర్ సిస్టమ్స్ బ్లూప్రింట్ పేరిట రూపొందించిన రిపోర్టును ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 120 మంది పైగా వక్తలు, 4,000 మంది పైచిలుకు హెచ్ఆర్ నిపుణులు పాల్గొన్నారు. -
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
ఐటీ ఆఫీసుల్లో ‘డ్రగ్స్’ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులుగా మారుతున్న నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డ్రగ్స్ కట్టడికి ప్రణాళిక రచించారు. క్షేత్రస్థాయిలో డ్రగ్స్‌కు డిమాండ్‌ను తగ్గిస్తే పై స్థాయిలో సరఫరా తగ్గుతుందని భావిస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. విద్యా, ఉద్యోగ సంస్థల్లో మాదకద్రవ్యాలు నియంత్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యా సంస్థలలో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసిన సీపీ.. ఐటీ ఆఫీసుల్లోనూ ఈ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా.. కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు వర్క్‌ఫ్రమ్ హోం చేసిన ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పని ఒత్తిడి, వీకెండ్ పార్టీలతో ఉద్యోగులెవరూ మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా నియంత్రించే ఉద్దేశంతో ‘డ్రగ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్’ (డ్రగ్స్‌కు తావులేని పని ప్రదేశం) నినాదంతో డ్రగ్స్ నిరోధక కమిటీలను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో చిన్న పెద్ద ఐటీ కంపెనీలు సుమారు వెయ్యి వరకు ఉంటాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది పురుష, 2.50 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పని ప్రదేశాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌కు మచ్చపడకుండా ఉంటుందని, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తు మత్తుకు చిత్తుకాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కమిటీలో సభ్యులు ఎవరెవరు? డ్రగ్స్ నిరోధక కమిటీలో స్థానిక పోలీసులతో పాటు కంపెనీ మేనేజ్మెంట్, మానవ వనరుల విభాగం (హెచ్ఆర్), సెక్యూరిటీ, ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే కమిటీల విధివిధానాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరు నుంచి ఆయా కమిటీలు కార్యరూపంలోకి రానున్నాయి. కమిటీలు ఏం చేస్తాయి? డ్రగ్స్ నిరోధక కమిటీలు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిసారిస్తాయి. 1. ఎవరైనా డ్రగ్స్‌ను ఆఫర్ చేస్తే ప్రలోభాలకు గురికాకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో సూచనలు ఇస్తారు. ఆఫర్ చేసిన స్నేహితుడు, సహోద్యోగిని నొప్పించకుండా సున్నితంగా ఎలా తిరస్కరించాలో నేర్పిస్తారు. 2. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిని కమిటీలు గుర్తించినా లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నవారు స్వచ్ఛందంగా కమిటీ ముందుకొచ్చినా.. వారు అలవాటును ఎలా మానుకోవాలో శిక్షణ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎన్జీవో, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3. కంపెనీలు, విద్యా సంస్థలలో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై కమిటీలు నిఘా పెడతాయి. విక్రయ, కొనుగోలుదారుల వివరాలను రహస్యంగా సేకరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ తరఫున కూడా చర్యలు ఉంటాయి. 150కి పైగా విద్యా సంస్థల్లో ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారిగా మాదాపూర్ జోన్లో 150కి పైగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే శంషాబాద్, బాలానగర్ జోన్లలోని విద్యా సంస్థలలో కూడా ఏర్పాటు చేయనున్నారు. జూలై నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం అయ్యాక ఆయా కమిటీలు కార్యరూపంలోకి వస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే హెచ్‌సీయూ, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి ప్రధాన విద్యా సంస్థల్లో సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ డివిజన్లోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 94920 99100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రోజుకి 9 గంటలపైనే పని
సాక్షి, అమరావతి: పని ప్రదేశాల్లో 64% మంది ఉద్యోగులు రోజుకు 9 గంటలకు పైగా ఒకే భంగిమలో కూర్చుంటూ పనిభారాన్ని మోస్తున్నారని గోద్రెజ్ ఇంటీరియో వర్క్‌ప్లేస్ సర్వే తెలిపింది. పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై గోద్రెజ్ ఇంటీరియో వర్క్‌ప్లేస్, ఎర్గోనామిక్స్ రీసెర్చ్ సెల్ ‘ఇట్స్ టైమ్ టు స్విచ్’ పేరుతో తాజాగా ఓ అధ్యయనం చేసింది. గంటల కొద్దీ ఒకే భంగిమలో పనిచేస్తుండటంతో అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించింది. వర్క్ డెస్క్‌లు, సమావేశాల్లో ఎక్కువ గంటలు కూర్చోవడం లేదా నిల్చుని ఉండటంతో కండరాలపై తీవ్ర ప్రభావం పడి త్వరగా అలసిపోతున్నారని పేర్కొంది. నిరంతరం ఒకే భంగిమలో కాకుండా కాసేపు కూర్చోవడం, కొద్ది సేపు నిల్చోవడంతో శరీరంపై ఒత్తిడి తగ్గుతుందని సూచించింది. ఈ విధానం ద్వారా బాగా పనిచేస్తూ..శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుకోవచ్చని తెలిపింది. పనిలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు అనుసరించిన పద్ధతులను తెలుసుకోవడానికిగాను దేశవ్యాప్తంగా 500 మంది నుంచి వివరాలను సంస్థ తీసుకుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం నుంచి ఉపశమనానికి ఏం చేయాలని ప్రశ్నించగా..73% మంది తమకు తెలియదని సమాధానమిచ్చారు. మరో 27% మంది ప్రత్యామ్నాయంగా నిల్చోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎక్కువసేపు నిల్చుని పనిచేయడం కూడా ప్రమాదమేనని సర్వే హెచ్చరించింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు కార్యాలయాల్లో సాంకేతిక సామర్థ్యంతో పాటు ఉత్పాదకతను పెంచడానికి సహాయపడే సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొంది. కరోనా మహమ్మారితో పనిచేసే విధానంలో సాంకేతికత జోడింపుతో చాలా మార్పులు వచ్చాయని, అయితే అధిక శాతం మంది ఉద్యోగులు పాత విధానంలోనే సీటుకు అతుక్కుపోయి పనిచేస్తున్నారని వివరించింది. ముఖ్యంగా కార్యాలయాల్లో కూర్చునే పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడింది. -
చేతులు కలిపిన మేటా, మైక్రోసాఫ్ట్ ! వీడియో చాట్‌కి కొత్త సొబగులు
Meta Partnership With Microsoft: టెక్నాలజీ రంగంలో పరస్పరం పోటీ పడుతున్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు చేతులు కలిపాయి. కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను మరింత చక్కగా వినియోగించుకునేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. నత్తనడకన వర్క్‌ప్లేస్ సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మేటాగా పేరు మార్చుకుంది. అయితే మేటా వీడియో చాట్ యాప్‌గా వర్క్‌ప్లేస్ ఉంది. ఈ వీడియో చాట్యాప్ ద్వారా ఉద్యోగులు వర్చువల్‌గా పని చేసుకునే వీలుంది. మేటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తరహాలో వర్క్‌ప్లేస్ పెద్దగా యూజర్ బేస్ సాధించలేక పోయింది. 2016 అక్టోబరులో వర్క్‌ప్లేస్ మార్కెట్లోకి వచ్చినా.. ఇప్పటి వరకు 7 మిలియన్లకు మించి పెయిడ్ యూజర్ బేస్ సాధించలేకపోయింది. లక్ష్యానికి దూరంగా మరోవైపు వీడియో చాట్ విభాగంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ టీమ్ యాప్‌ని అందిస్తోంది. వర్క్ప్లేస్తో పోల్చితే టీమ్ యాప్‌కి కస్టమర్ బేస్ ఎక్కువగానే ఉంది. 250 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్లు ఈ యాప్‌కి ఉన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ టీమ్ సైతం ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఎదగలేక పోయింది. ఈజీగా రెండు పనులు దీంతో వీడియో చాట్ విభాగంలో స్కైప్, జూమ్, గూగుల్ డుయోలకి పోటీగా మార్కెట్లో నంబర్ స్థానం లక్ష్యంగా మేటా, మైక్రోసాఫ్ట్‌లు జట్టు కట్టాయి. దీని ప్రకారం ఒకే యాప్‌లో ఉన్నప్పటికీ రెండు యాప్‌లలో ఉండే సౌకర్యాలను పొందవచ్చు. ఉదాహారణకు మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్‌లో ఉంటూనే వర్క్‌ప్లేస్ యాప్‌లో న్యూస్ ఫీడ్‌ను చూసుకోవచ్చు. నంబర్‌వన్ రోనా సంక్షోభం తర్వాత వీడియో చాట్ యాప్‌ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వర్చువల్ కాన్ఫరెన్సులు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు యాప్‌లకు ఉన్న యూజర్ బేస్‌ను కాపాడుకుంటూ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్, మేటాలు జట్టుకట్టాయి. వీడియో చాట్ విభాగంలో నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. చదవండి:యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే -
పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో అందరూ వర్క్ ఫ్రం హోంకే పరిమతమయ్యరు. చాలామంది దీనికే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని నెలలుగా ఆఫీసులు, పరిశ్రమలు మళ్లీ తెరవడంతో అందరూ ఆఫీసులకి వెళ్లడం మొదలైంది. ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంటి వాతవరణాన్ని ఆఫీస్ మాదిరిగాసెట్ చేసి పనులు చేసుకున్నారు. ఎప్పుడేతే బాస్‌లు ఆఫీస్‌లకు రమ్మని చెప్పారో అక్కడి వాతావరణానికి అలవాటుపడటానికీ, యథాస్థితికి రావడటానికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనకు నచ్చిన విధంగా, ఎలా కావల్సితే అలా ఉండేవాళ్లం.. తినేవాళ్లం. కానీ ఆఫీసులో అలా తినడానికి.. ఉండటానికి కుదరదు. క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. అయితే అలా వెళ్లడానికి బద్దకించి.. కొందరు కూర్చున్న దగ్గరే తింటున్నారట. కానీ ఇలా పని చేసే దగ్గరే తింటే అది మన ఆరోగ్యం మీద రకరకాల దుష్ప్రభావాలు చూపుతుందంటున్నారు నిపుణులు. ఆ దుష్ప్రభావాలు ఏంటంటే.. తెలియకుండానే ఎక్కువ తినేస్తాం.... వర్క్ ప్లేస్‌లో తినేటపుడు ఒక చేతిని కీబోర్డు పై ఉంచి.. మరొక చేత్తో స్పూన్ పట్టుకుని తినడం వల్ల ఎంత తింటున్నమో? ఏమి తింటున్నామో గమనించకుండా తినేస్తాం. దీని వల్ల ఎక్కువ కేలరీలు మన శరీరంలో చేరి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. (చదవండి: మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్!) గబగబ తినేయడం.... వర్క్ హడావిడలో గబగబ తినేయడంతో మధ్య మధ్యలో గాలిని మింగేస్తాం, నీళ్లు తాగేస్తుంటాం. దీని వల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ ట్రబుల్ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానుగుణంగా తినడం...... సమయానుగుణంగా తినకపోవటం చాలా మంది చేసే అతి పెద్ద తప్పు. వర్క్ ఎక్కువగా ఉందనో లేక ఇతరత్ర కారణాల వల్ల చాలా మంది టైమ్‌కి తినరు. ఇది మన జీర్ణవ్యవస్థ మీద అత్యంత దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఎసిడిటీ, అల్సర్, వంటి రకరకాల వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరూ ఇంతలా కష్టపడి పనిచేసేది కుటుంబం కోసమే కదా. విరామం తీసుకుని నిదానంగా తింటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం దొరికనట్టు ఉంటుందీ, మళ్లీ మరింత వేగంగా, ఉత్సహంగా పనిచేయగలిగే శక్తి లభిస్తోంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి బ్రేక్ తీసుకుని నిదానంగా, టైంకి బోజనం చేయడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యగంగా ఉంటాం. అప్పుడే మనం, మన ఫ్యామీలీతో ఉల్లాసంగా గడపగలం. కాబట్టి క్యాంటీన్ ఏరియాకు వెళ్లి తినడం మేలు. (చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్) -
ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
థింక్ డిఫరెంట్ క్యాప్షన్ తో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థలో వరల్డ్ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్ సంస్థ గ్లోబల్ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్ స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెర్ స్కార్లెట్ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఆపిల్ నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి : ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి! -
లైంగిక వేధింపులపై ఓ సంస్ధ సర్వే
-
వర్క్‌ప్లేస్: ఫేస్బుక్ కొత్త ఫీచర్
లండన్: మైక్రోసాఫ్ట్ యామ్మర్, సేల్స్‌ఫోర్స్ చాట్టర్ అండ్ స్లాక్‌లకు పోటీగా ఫేస్బుక్ వర్క్‌ప్లేస్ అనే కొత్త అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కార్యాలయాల్లో వాడుతున్న ఇంట్రానెట్, మెయిల్‌బాక్స్, ఇతర అంతర్గత సమాచార వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా దీనిని ఫేస్బుక్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల క్రితమే ఫేస్బుక్ లండన్ కార్యాలయంలో దీనిని అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా 1,000 సంస్థల్లో పరీక్షించారు. ఈ సేవలను స్వచ్ఛంద, విద్యా సంస్థలకు ఫేస్బుక్ ఉచితంగా అందించనుంది. మిగతా కంపెనీల వారికి రుసుము ఉంటుంది. -
ఇక టెకీల యూనియన్లు!
చెన్నై: దాదాపు 4.5లక్షల మంది టెకీలకు నిలయమైన చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం టెకీలు కూడా యూనియన్లను స్థాపించుకోవచ్చని ప్రకటించింది. కార్మిక సంఘాలు వేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చిన ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. 1947 పారిశ్రామిక వివాదాలు యాక్ట్ కింద టెకీ ఉద్యోగులు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకుని తన బాధలను వ్యక్తం చేయోచ్చని తెలిపింది. కాగా, ఐటీ సెక్టార్ ఈ ప్రకటనను విపరిణామంగా భావిస్తోంటే.. యూనియన్లు మాత్రం ఇది ఉద్యోగుల పాలిట వరంగా భావిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లను స్థాపించుకోవడం ఉద్యోగుల హక్కు అని కొంతమంది యూనియన్ల ప్రతినిధులు అంటున్నారు. హెచ్ సీఎల్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సరిగా పనిచేయడం లేదని గతనెలలో తీసేయగా.. మద్రాసు హైకోర్టు ఉద్యోగిని ఉన్నపళంగా తీసేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఒక పని చేసే వ్యక్తేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఏవరినైనా ఉద్యోగంలో తీసుకున్న తర్వాత వర్క్ మాన్ షిప్ నుంచి ఉన్నపళంగా తప్పించలేరని తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఫ్యాక్టరీలకే పరిమితమైన ట్రేడ్ యూనియన్లు టెకీ కంపెనీల్లో కూడా ఆరంభం కానున్నాయి.