సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తమ బతుకుల్లో వెలు గులు నింపాలని అన్ని కార్మి క సంఘాలు డిమాండ్ చేశాయి. సింగరేణి కార్మి కుల ఎజెండాపై గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘సాక్షి చర్చా వేదిక’లో అన్ని గుర్తింపు, జాతీయ, విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
కెంగర్ల మల్లయ్య– టీజీబీకేఎస్, వాసిరెడ్డి సీతారామయ్య– ఏఐటీయూసీ, జనక్ ప్రసాద్–ఐఎన్‌టీయూసీ, రియాజ్ అహ్మద్– హెచ్‌ఎంఎస్, యాదగిరి సత్తయ్య–బీఎంఎస్, తుమ్మల రాజారెడ్డి– సీఐటీయూ,జి.రాములు– ఏఐఎఫ్‌టీయూ, విశ్వనాథ్, నరేష్–ఐఎఫ్‌టీయూ పాల్గొన్నారు.
కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, కాంట్రాక్టు కార్మి కుల క్రమబద్దీకరణ, రెండుపేర్లకు చట్టబద్ధత, ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటికల, డీఎంఎఫ్ నిధుల మళ్లింపు వంటి ప్రధాన సమస్యలపై ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలతో కాలయాపన చేయడమే తప్ప.. ఇంతవరకూ ఆ సమస్యలను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగనులు, ఉపాధి ఎక్కడ...?
తెలంగాణ రాష్ట్రం వస్తే.. కొత్త గనులు వచ్చి స్థానికులకు ఉపాధి లభిస్తుందనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ఇక్కడ మరో 180 ఏళ్లకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఏటా ఐదు కొత్త గనులు ప్రారంభించి, దాదాపు లక్ష మందికి కల్పించే వీలుందని సింగరేణి ఉన్నతాధికారులే ధ్రువీకరించారని గుర్తు చేశారు.
కానీ 1.16 లక్షల మంది కార్మికులున్న సంస్థను ఇపుడు 40 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మి కులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నా.. వారికి అత్తెసరు వేతనాలే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ డిమాండ్లు
♦ కాంట్రాక్టు కార్మి కులను వెంటనే క్రమబద్దీకరించాలి.
♦ ఆదాయపు పన్ను మినహాయింపులో స్లాబ్ మార్చడం లేదా పార్లమెంటులో చట్టం ద్వారా శాశ్వత ఉపశమనం కల్పించాలి
♦ డీఎంఎఫ్‌టీ (డిస్ట్రిక్ట్ మిమినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించకుండా సింగరేణి ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేయాలి.
♦ ఇక రెండు పేర్ల చట్టబద్ధతపై విధానపరమైన నిర్ణయం తీసుకుని వారి వారసులకు 40 ఏళ్ల వయోపరిమితితో కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి.
♦ బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న డిమాండ్‌ను నిలబెట్టుకోవాలి
♦ సింగరేణి డిక్లరేషన్ తేవాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్ తరహాలో అన్ని పార్టీ లు సింగరేణి డిక్లరేషన్ చేసిన వారికే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సింగరేణి మనుగడకు గతంలో పార్టీలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తారో వారికే తమ సంఘాలు, కార్మి కులు మద్దతు తెలుపుతాయని నేతలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment