వేల కళ్లలో వెలుగులు  | A 20 year dream of contract workers has come true | Sakshi
Sakshi News home page

వేల కళ్లలో వెలుగులు 

Published Sat, Jun 10 2023 5:23 AM | Last Updated on Sat, Jun 10 2023 2:29 PM

A 20 year dream of contract workers has come true - Sakshi

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది.  

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.  పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం  తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.  
విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం  జగన్‌ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా  కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు  క్షీరాభిషేకం చేశారు.  
 సీఎం జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు.  ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.  
తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి  ధన్యవాదాలు తెలిపారు.   ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్‌ తదితరులున్నారు.  
ఏపీ ఎన్‌జీవోలు కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.  నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో గవర్నమెంట్‌ ఫెడరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్, కాంట్రా­క్ట్‌ ఉద్యోగులు సంబరాలు చేసు­కున్నా­రు. 
 కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్‌రెడ్డి, ఏపీఎన్జీవోస్‌ నేతలు పాల్గొన్నారు. 
 క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్‌ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్విసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్‌ సెక్రటరీ ఆర్‌.గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు.  
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్‌ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్‌ పార్క్‌లో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement