సాక్షి, విజయవాడ: గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చూస్తున్నారని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేము. లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తుంది.
గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే చూస్తున్నారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చూపించి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. ప్రతిపక్షం మాయల మరాటీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment