గిఫ్ట్‌ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేశారు | Sharmila misused the gift deed says sajjala | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేశారు

Published Sat, Oct 26 2024 4:58 AM | Last Updated on Sat, Oct 26 2024 4:58 AM

Sharmila misused the gift deed says sajjala

చెల్లిపై ప్రేమతోనే సొంత ఆస్తుల్లోనూ వాటా ఇవ్వాలనుకున్న జగన్‌ 

హైకోర్టు స్టేటస్‌కో ఉన్నా షర్మిల షేర్లు మార్చుకున్నారు 

ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి 

పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు 

సాక్షి, అమరావతి: రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిలపై ప్రేమాభిమానాలతోనే సొంత ఆస్తుల్లోనూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటా ఇస్తామన్నారని, కానీ గిఫ్ట్‌ డీడ్‌ను షర్మిల దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు జగన్‌ వద్దే ఉన్నాయని తెలిసే అవి పోయాయని అబద్ధాలాడారని, షర్మిల చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్‌ కేసు పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. సజ్జల శుక్రవారం పార్టీ నాయకులు, శ్రేణులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? షర్మిల తీరు, ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. సరస్వతి పవర్‌ షేర్ల మ్యాటర్‌ హైకోర్టులో ఉందన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులపై స్టేటస్‌కో మెయిన్‌టెయిన్‌ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. వైఎస్‌ జగన్‌పై అప్పట్లో కాంగ్రెస్‌  అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తే.. ఆయన ఆస్తుల అటాచ్‌మెంట్‌ కూడా జరిగిందని తెలిపారు. 

అలా ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే, దాన్ని ఆపాలంటూ వైఎస్‌ జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప, ఆస్తులు వెన­క్కు తీసుకో­వాలని కాదన్నారు. సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలి­సి కూడా షర్మిల కుయుక్తులు పన్నార­ని చెప్పారు. న్యాయపరంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే సీఎం చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారన్నారు. 

ఇది తెలిశాక ఆ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమంటూ ఆపాలంటూ చెల్లెలికి జగన్‌ లేఖ రాశారని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకొన్నారని తెలిపారు. షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని, దానిని ఆపకుంటే ఇబ్బందులొస్తాయని న్యాయ నిపుణులు చెప్పారన్నారు. ఈ వాస్తవ విషయాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement