సమ్మె...సక్సెస్
నల్లగొండ : కార్మిక సంఘాల ఆధ్వర్యం లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగి సింది. కార్మిక సంఘాలకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. సమ్మెలో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ఆటో వర్కర్లు, హమాలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
సమ్మెకు మద్దతుగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. కార్మికులకు సమ్మెకు మద్దతుగా సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిపేశారు. జిల్లా కేంద్రంలో భోజన విరామసమయంలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతు తెలిపాయి. స్థానిక గడియారం సెంటర్ వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
భువనగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయా యి. అన్ని మండలాల్లో వివిధ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. మిర్యాలగూడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద సభ నిర్వహించారు. వేములపల్లిలో సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా....దామరచర్లలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై కార్మికులు మానవహారం నిర్వహించారు. కోదాడ లో కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాలు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించాయి.
ఆర్టీసీ బస్టాండ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యం లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఆటోలతో ర్యాలీతో నిరసన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు నిర్వహించారు. చౌటుప్పల్‌లో సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలను బంద్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మునుగోడులో ర్యాలీ తీశారు. చండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఆలేరు ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, రాజాపేట, గుండా ల, తుర్కపల్లి మండలాల్లో కార్మిక సం ఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. హుజూర్‌నగర్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ, వైఎస్సార్‌సీపీటీ యూ, కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచ ర్ల, మేళ్లచెర్వులో ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి, మోత్కూరు, నూతనకల్, తుంగతుర్తి, శాలిగౌరారం, అర్వపల్లి మండల కేం ద్రాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు. దేవరకొండలో కార్మి క సంఘాలు తలపెట్టిన సమ్మెలో ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు.