వర్తకంపై మరింత వాయింపు | doubly trade tax in cities | Sakshi
Sakshi News home page

వర్తకంపై మరింత వాయింపు

Published Wed, Jan 22 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

doubly trade tax in cities

సాక్షి, రాజమండ్రి : నగరపాలక సంస్థల్లో వర్తకులపై ఏటా విధించే వర్తకపు పన్ను (ట్రేడ్ ట్యాక్స్) 50 శాతం వరకూ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పెరిగిన పన్నులు చెల్లించాల్సిందిగా వర్తకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరపాలక సంస్థల్లో వ్యాపారాలు చేసేవారు ఏటా ట్రేడ్ ట్యాక్స్ చెల్లించాలి.

దీనిని ప్రతి మూడేళ్లకు 33.3 శాతం మించకుండా పెంచుతారు. కానీ పురపాలక శాఖ ఈ ఏడాది కొన్ని రకాల వ్యాపారాలపై 50 శాతం పన్నులు పెంచేసి, వాటిని చెల్లించి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. సుమారు 390 పైగా రకాల వ్యాపారాలపై ఉన్న పన్నులను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి ఇంటింటికీ తిరిగి పాలమ్ముకునేవారిని కూడా వదల్లేదు.

 ఈ అడ్డగోలు పెంపుదలను వర్తకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పన్నుల పెంపు శాతాన్ని తగ్గించాలని కోరుతూ రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మంగళవారం నగరపాలక సంస్థ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన పన్నులు తగ్గించకుంటే చాంబర్ పరిధిలోని వర్తక సంఘాలతో సంప్రదించి ఉద్యమించడానికి కూడా వెనుకాడబోమని చాంబర్ కార్యదర్శి బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇప్పటికే వర్తకులు నష్టపోయారని, ఈ సమయంలో పన్నులతో మరింత ఇబ్బంది పెట్టడం సరి కాదని అన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను ఈ ఏడాదికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

 
 వివిధ వ్యాపారాలపై పన్నుల పెంపు ఇలా..
 వ్యాపారం                             అమలులో   పెంచిన పన్ను
                                         ఉన్న పన్ను   (రూ.లలో)
 కిరాణా దుకాణాలు                        593           890
 హోల్‌సేల్ కిరాణా                        354            531
 నూనె వ్యాపారం (హోల్‌సేల్)        806            1209
 నూనె వ్యాపారం (రిటైల్)            354            531
 అపరాల వ్యాపారం (హోల్‌సేల్)      1000            1500
 అపరాల వర్తకులు (రిటైల్)            470             876
 ఉల్లి, చింతపండు (హోల్‌సేల్)      983            1475
 ఉల్లి, చింతపండు (రిటైల్)            283             425
 స్టేషనరీ దుకాణాలు                  761            1142
 వస్త్రాలు                                    806            1209
 చిన్న వస్త్ర వ్యాపారులు                  470            705
 మొబైల్ పాల వ్యాపారులు             335             452
 పాలు, పెరుగు, నెయ్యి దుకాణాలు 470           705

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement