పైస్థాయిలో కదలిక లేకుండా సాధ్యం కాదంటున్న ఉద్యోగ సంఘాలు
వ్యవసాయ శాఖలో ఏఈ, ఏడీఏ పోస్టుల ప్రమోషన్లకే డీపీసీ ఏర్పాటు
అక్కడ ఖాళీలు లేకుంటే అడ్డంకులే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు.
వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
అతి కొద్దిగా మాత్రమే రిటైర్‌మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు.
ఏళ్లుగా ఎదురుచూపులు
వ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి.
సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్‌ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు.
దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
బదిలీల మాటేంటి?
గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు.
కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment