కార్మిక సంఘాల విస్తృత ప్రచారం
నగర పరిశ్రమల సమస్యలపై డిమాండ్లు
గాజువాక : కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సమ్మెకు సైరన్ మోగింది. షేర్ల విక్రయం పేరుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల్లో మార్పులపై శరవేగంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగుస్తోంది. 11 కేంద్ర కార్మిక సంఘాలు 12 ప్రధాన డిమాండ్లపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత కార్మిక సంఘాలు స్థానిక కార్మిక సంఘాలను సైతం కలుపుకొని సమ్మె సన్నాహాల్లో తలమునకలయ్యాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్, భెల్, షిప్‌యార్డు వంటి కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని ఆయా సంఘాల నాయకులు ఇప్పటికే తమ యాజమాన్యాలకు సమ్మె నోటీసులను సైతం అందజేశారు. సమ్మె విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారం ముమ్మరం చేశారు.
సార్వత్రిక సమ్మె డిమాండ్లు ఇవీ...
కార్మిక హక్కులకు భంగం కలిగే చట్ట సవరణను నిలిపివేయాలి. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులకు, కార్మిక నాయకులకు జైలు శిక్షల ప్రతిపాదనలు రద్దు చేయాలి. {పభుత్వరంగ పరిశ్రమల్లో షేర్ల విక్రయాన్ని నిలిపివేయాలి.రైల్వే, డిఫెన్స్‌లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రద్దు చేయాలి.
ప్రధాన పరిశ్రమల్లో...
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్...స్టీల్‌ప్లాంట్ పెట్టుబడుల విక్రయాల ప్రతిపాదనను విరమించాలి.ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.హుద్‌హుద్ నష్ట పరిహారంగా ప్లాంట్‌కు రెండేళ్లపాటు టాక్స్ హాలిడే ప్రకటించాలి.స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుల ఉపాధి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.కార్మికులకు సంబంధించిన అన్ని రకాల హక్కులు, సౌకర్యాలను వెంటనే అమలు చేయాలి.స్టీల్‌ప్లాంట్‌ను జాతికి అంకితం ఇస్తున్న సందర్భంగా ప్రతి కార్మికునికి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
భెల్ (బీహెచ్‌పీవీ)...
1997 వేతన సవరణ అమలు చేయడంతోపాటు, ఏరియర్స్ చెల్లించాలి.రిటైర్ కాబోతున్న కార్మికులు, ఉద్యోగులకు భెల్ మాదిరిగా మెడికల్, పెన్షన్ స్కీమ్‌లను ప్రకటించాలి.కార్మికులకు కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించాలి.{పమోషన్లను వెంటనే అమలు చేయాలి.ర్వీస్ సెక్షన్లలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి.
షిప్‌యార్డు:
షిప్‌యార్డు కార్మికులకు రావాల్సిన రూ.54కోట్ల గత వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి.ఎల్ అండ్ ఎం సిరీస్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.అన్ని కేటగిరీల్లో ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.పోస్టు రిటైర్‌మెంట్ మెడికల్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలి.నూతన పింఛను పథకాన్ని ఇతర పరిశ్రమల మాదిరిగా అమలు చేయాలి. కొత్తగా రిక్రూట్ అయినవారికి ప్రమోషన్లలో అన్యాయాన్ని అరికట్టాలి.
పరిశ్రమల్లో సమ్మె ‘సై’రన్
Published Wed, Aug 19 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement