సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త అందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేసేలా నిబంధన విధించారు.
తాజాగా సీఎం జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు మంగళవా రం ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును రెగ్యులరైజ్ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తా నని గత ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు.
నాడు బాబు సర్కారు నమ్మక ద్రోహం..
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని గ తంలో చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పింది. ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మో సం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యు లరైజేషన్‌పై ముగ్గురు మంత్రుల బృందాన్ని నియ మిస్తూ 2014 సెప్టెంబర్ 9న చంద్రబాబు సర్కారు జీవో 3080 జారీ చేసింది. ఐదేళ్ల పాటు సమావేశాలతో సాగదీసిన మంత్రుల బృందం చివ రికి కోర్టు తీర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యం కాదంది.
నేడు మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేర కు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగ మించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సిద్ధ మైంది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీ లైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ క మిటీని నియమించింది. ఈ కమిటీలు న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులపై చర్చించాయి.
రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొడ్డి దారి కాకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చిక్కులు ఎదురుకాకుండా న్యా యపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణ లోకి తీసుకుంది. నాడు బాబు సర్కారు కోర్టు తీ ర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసగించగా సీఎం జగన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రమబద్ధీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం హర్షం
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ విషయంలో తొలుత విధించిన ఐదేళ్లు సర్వీసు నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు.
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెటు్టకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.
వేల మందికి మేలు
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్సీ తమటం కల్పలత పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారన్నారు.
మనసున్న ముఖ్యమంత్రి
వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి నిరూపించుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
– కె.మురళిరెడ్డి, యూనివర్సిటీస్ వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
చిరస్మరణీయమైన రోజు
కాంట్రాక్టు ఉద్యోగులకు ఇది జీవితంలో మరిచిపోలేని రోజు అని తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ అవుతారని తెలిపారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
– ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
వెలుగులు నింపిన సీఎం
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మందిని రెగ్యులరైజ్ చేసేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మాటకు కట్టుబడ్డ సీఎం జగన్‌కు సంఘం నేతలు వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, కరీంఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ రెగ్యులర్ చేస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.సాయిరాజు పేర్కొన్నారు.
– గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్
Comments
Please login to add a commentAdd a comment