సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు.
ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment