![Secretary Pola Bhaskar Trade Unions Meeting Over Zonal System - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/31/Unions-Meeting-Over-Zonal-System.jpg.webp?itok=trm3Emrz)
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment