Pola Bhaskar
-
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలపై ఉద్యోగ సంఘాల భేటి
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
ఏపీ పాలీసెట్ 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్ పోల భాస్కర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్ జరుగుతుందన్నారు. పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. -
23 నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 3న సీట్లు కేటాయించనున్నారు. అదే నెల 6లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నీట్ కౌన్సెలింగ్ జరగనందున బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ), అగ్రికల్చర్ బీఎస్సీకి కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ► అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: డిసెంబర్ 23 నుంచి 25 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్, ఆఫ్‌లైన్ (హెల్ప్‌లైన్ సెంటర్స్): డిసెంబర్ 27 నుంచి 29 వరకు ► ఆప్షన్ల నమోదు: డిసెంబర్ 28 నుంచి 30 వరకు ► ఆప్షన్ల సవరణ: డిసెంబర్ 31 ► సీట్ల కేటాయింపు: జనవరి 3, 2022 ► సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్: జనవరి 4 నుంచి 6 వరకు. -
ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం కోటా అమలుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెట్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, చీఫ్ క్యాంపు ఆఫీసర్ (అడ్మిషన్స్) డాక్టర్ బల్లా కళ్యాణ్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కాలేజీల్లోని కోర్సుల్లో పది శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లోని సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తున్నారు. కన్వీనర్ కోటాలో 7 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 3 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా కేటాయిస్తున్నారు. అయితే కన్వీనర్ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తోంది. వారిపై పైసా భారం పడదు. మేనేజ్మెంట్ కోటా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఆ కోటాలో సీట్లు పొందే ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు ఫీజు వారే చెల్లించాలి. ఇది కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై ఇంత ఫీజు భారం సరికాదన్న ప్రభుత్వ అభిప్రాయం మేరకు మొత్తం 10 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల ఆ విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ప్రైవేటు యూనివర్సిటీల్లో కేంద్ర చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాకు అవకాశం లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ఆ కోటా అమలు కాదు. నేడు ఈఏపీ సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీ సెట్–2021 సీట్ల కేటాయింపు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీనే సీట్లు కేటాయించాల్సి ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకోవలసి ఉండటంతో వాయిదా పడింది. గురువారం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నుంచి సీట్లు కేటాయిస్తారు. -
పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
AP: పాలిటెక్నిక్ ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: పాలిటెక్నిక్ ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా పాలిసెట్ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్నికల్ ఎడ్యకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాం. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చదవండి: (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) కాగా, రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే.. ►అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ►అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ►అక్టోబర్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం కల్పించాం. ►అక్టోబర్ 9న ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది. ►అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు ఉంటుంది. ►అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి. ►18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకి తరగతులు ప్రారంభం చదవండి: (దసరాలోపు టీచర్ల పదోన్నతులు) -
కలెక్టర్‌కు షోకాజ్ నోటీసు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు జారీ చేసింది. విద్యుత్ కారిడార్ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయని కలెక్టర్‌పై కమిషన్ సీరియస్ అయింది. రెండు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు ఏపీఈఆర్సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఏపీ ట్రాన్స్‌కో 2017లో పొదిలి–పర్చూరు మధ్య 220 కేవీ విద్యుత్ లైన్ వేసింది. ఈ క్రమంలో సుబాబుల్ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా లైన్ వెళ్లింది. దీనివల్ల 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం ఇవ్వాలని విద్యుత్ ఉన్నతాధికారులను కోరాడు. దీనికి వాళ్లు నిరాకరించారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితుడు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5న ఆ రైతు ఏపీఈఆర్సీని ఆశ్రయించాడు. కమిషన్ వివరణ కోరినా ప్రకాశం జిల్లా కలెక్టర్ స్పందించలేదు. దీంతో విద్యుత్ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కలెక్టర్‌కు కమిషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. -
వారంతా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లారు: కలెక్టర్
సాక్షి, ప్రకాశం: జిల్లాలో 280 నుండి 300 మంది వరకు న్యూఢిల్లీలో మత ప్రార్ధనలకు వెల్లారని కలెక్టర్ పోలా బాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరిలో ఇప్పటీ వరకు 132మందిని గుర్తించి వారి శాంపిల్స్‌ను తెలుగు రాష్ట్రంలోని వివిధ ల్యాబరేటరిలకు పంపించామని తెలిపారు. అందులో 96 శాంపిల్స్‌ను పరిశీలించగా 8మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ఇక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటోన్మెంట్ టాస్క్ ఆపరేషన్ మొదలు పెట్టి ప్రత్యేక అధికారులను కేటాయించామన్నారు. మార్కాపురం, ఒంగోలు ఇస్లాంపేటకు సంబంధించిన రిపోర్ట్స్ రావలసి ఉందని అయితే కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక మూడు రైళ్లలో వారంతా ప్రయాణించినట్లు గుర్తించామని తెలిపారు. కందుకూరు, కనిగీరి, మార్కాపురం పట్టణాలను రిస్క్ జోన్లుగా ప్కటించామని చెప్పారు. (కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కేంద్రం అయిన ఒంగోలులోని కిమ్స్, సంఘమిత్ర, వంటి నాలుగు ప్రధాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. వారంతా ఢిల్లీకి వెళ్లడంపై ఆరా తీస్తున్నామని, వారితో సంభందం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వసతి సదుపాయం కల్పించడానికి ఓ లాడ్జినీ తీసుకున్నామన్నారు. 12నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క టి చొప్పున క్వారంటైన్ వార్డులను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ క్వారంటైన్ వార్డుకి ఒక మెడికల్ అధికారిని నియమించామని, పోలీసులు, రెవిన్యూ, వైద్య మూడు విభాగాలు మండల స్ధాయి నుండి కో-ఆర్డినెషన్ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నామన్నారు. కాగా ప్రజలు ఎవ్వరు కూడా కోవిడ్-19పై భయబ్రాంతులకు గురికావద్దని.. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, తగిన స్ధాయిలో నిలువలు ఉన్నాయి చెప్పారు. అయితే వారితో కలిసి ఢిల్లీకి మతప్రార్ధనలకు వెళ్లోచ్చిన వారంతా స్వచ్చందంగా ముందుకు వస్తే వారందరి వైద్యం అందిస్తామని కలెక్టర్ పిలుపు నిచ్చారు. (‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’) -
రైతులందరికీ భరోసా
సాక్షి, ఒంగోలు అర్బన్: ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం కింద జిల్లాలో పెండింగ్, తిరస్కరణకు గురైన దరఖాస్తులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ వ్యవసాయ, మార్కెట్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.35 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. మరో 1.6 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 61253 దరకాస్తులు ఆధార్ అనుసంధానంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. రైతు కుంటుంబాల్లో భార్య లేదా భర్త మృతి చెందితే వారి వారసులకు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ద్వారా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యల వల్ల లక్షలాది మంది రైతులకు రైతు భరోసా అందలేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడుబు పొడగించినట్లు తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో లేని రైతు కుంటుంబాలను తక్షణమే నమోదు చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని అందుకోసం ఆర్టిజిఎస్ ద్వారా తహశీల్దర్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఈఓఆర్డిలు, ఉప తహశీల్దార్లుకు లాగిన్లు నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాకు ఆర్టిజిఎస్ కో ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. శనగ పంటకు రాయితీ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శనగపంట రాయితీ రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ ఉన్న శనగల వివరాలు సమగ్రంగా పరిశీలించాలన్నారు. 6896 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. 17247 మంది దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ క్రాఫ్ట్, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేసిన రైతు వివరాలు, బ్యాంకు ఖాతాలు పోల్చి చూడాలన్నారు. 75 వేల క్వింటాళ్లు జెజె11రకం, కాక్–2 రకం శనగ విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు పంపిణి చేసేందుకు సిద్ధగా ఉన్నట్లు తెలిపారు. కిలో 31రూపాయల చొప్పున నాణ్యమైన విత్తనాలు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 49 మండలాల్లో 65 కేంద్రాలు గుర్తించామని వాటిద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం కావాలన్నారు. నవంబర్ 15వ తేది లోపు ఈ క్రాప్ జీపీఎస్ ద్వారా పంటల వారీగా రైతుల వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రైతు ప్రకాశం కార్యక్రమాన్ని త్వరలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రైతుల్లో మానసిక ధైర్యం కల్పించడం, రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయడం, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి నూతన వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. అందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి నాటికి రైతు ఉత్పత్తి సంఘాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటలు జిల్లాలోని 26 మార్కెట్ యార్డుల్లో విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ గ్రామ సభలు పూర్తి అయిన వెంటనే రైతుల నుంచి అందే దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ లబ్ది చేకూరాలన్నారు. శనగ విత్తనాలు అక్రమ అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ–2 నరేంద్రప్రసాద్, డీఆర్ఓ వెంకట సుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్డీఓలు ప్రభాకర్‌రెడ్డి, ఓబులేష్, శేషిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, మార్కెంటింగ్ శాఖ ఏడీ ఉపేంద్రతో పాటు జిల్లా అధికారులు, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
'వలంటీర్లతోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది'
సాక్షి, ఒంగోలు : వలంటీర్లు గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మల వంటి వారని, వారి ద్వారా క్షేత్రస్థాయిలో పాలన సులువుగా మారిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. ‘రైతు భరోసా’ ప్రక్రియలో ఎదురైన సమస్యలను రెండు రోజుల్లోపే పరిష్కరించ గలగడం దీనివల్లే సాధ్యపడిందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పది ప్రత్యేక కార్యక్రమాలకు తాము రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్ర: వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది? కలెక్టర్: ఈనెల 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు అనేక సమస్యలు వెల్లువెత్తాయి. వాటన్నింటిని పరిష్కరించాలంటే ఫీల్డులో పని చేసేవారు కావాలి. దీంతో వలంటీర్లను రంగంలోకి దించాం. వారందరికి మొబైల్‌కే అప్లికేషన్ ఇవ్వడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే వాటన్నింటిని పూర్తిచేశారు. వాస్తవానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోతే ఇది అసాధ్యంగా ఉండేది. వలంటీర్లవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు సత్వరమే ప్రజల ముంగిటకు తీసుకువెళ్లగలుగుతున్నామనేది వందశాతం వాస్తవం. ప్ర: రైతు భరోసా పథకంలో ఎంతమందికి లబ్ది చేకూరుతుంది కలెక్టర్: రైతు భరోసా పథకం కింద ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా కొంతమంది ప్రజాసాధికార సర్వేలో లేనివారు కూడా ఉన్నారు. వారికి అర్హత కల్పించేందుకు ప్రజాసాధికార సర్వేచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అయితే ప్రజాసాధికార సర్వేతోపాటు వారు వెబ్‌ల్యాండ్‌లో కూడా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గతంలో వీటికి సంబంధించి కొంత పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అందువల్ల వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. అయితే తాము, గ్రామస్థాయిలో వాలంటీర్లు చూపుతున్న చొరవ వల్ల మరో 10వేల మంది లబ్దిదారులు పెరుగుతారని భావిస్తున్నాం. అయినా భూములు తమపైన లేనివారు, భూమి యజమాని చనిపోయినా వాటిని తమ పేరు మీదకు మార్చుకోని కుటుంబాలవారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు తప్ప అత్యధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతు భరోసా స్కీములో లబ్దిదారులను గుర్తించడంలో ప్రకాశం ప్రథమ స్థానంలో ఉంది. ప్ర: సచివాలయ భవనాల పరిస్థితి కలెక్టర్: గ్రామ సచివాలయాలకు ప్రస్తుతం జిల్లాలో 1038 పంచాయతీలకుగాను 1038 పంచాయతీ కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న భవనంకు అదనంగా గదులు నిర్మించడం లేదా అంతస్తు నిర్మించడం కోసం దాదాపు 180 వరకు గుర్తించాం. వీటికి రు25లక్షలు కేటాయిస్తున్నాం. అయితే ప్రతి గ్రామ సచివాలయ భవనం 2వేల చదరపు అడుగులలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నూతనంగా నిర్మించేవాటికి మాత్రం రు40లక్షలు కేటాయిస్తున్నాం. ఇందుకు రూ.350కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్ర: వలంటీర్లను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? కలెక్టర్: వలంటీర్లు పెద్ద ఎత్తున జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. వీరంతా చాలా మంచి నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వీరందరి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు సచివాలయ స్థాయిలో పంచాయతీ కార్యదర్శితో వీరికి సమన్వయం చేయబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా పంచాయతీ నుంచి మండల స్థాయికి కూడా కనెక్టివిటీని తీసుకురావడం ద్వారా వేగవంతంగా ఫలితాన్ని పొందేందుకు, ప్రజలకు సేవలు అందించొచ్చు. ప్ర: ఇసుక సమస్య గురించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? కలెక్టర్: పాలేరు–బిట్రగుంటకు సంబంధించిన ఇసుకను ఒంగోలు, కందుకూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాలలో నాలుగు స్టాక్ యార్డులకు తరలించడం ద్వారా ఇసుక సమస్యకు పరిష్కారం చేయదలిచాం. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు టీములను కూడా ఆదివారమే పంపిస్తున్నాం. వారు వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ఇసుక సమస్యకు అతి త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. గిద్దలూరుకు ఇసుక సమస్యను నివారించేందుకు ఏంచేయాలనే దానిపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పట్టా భూముల్లో ఇసుకను సైతం మైనింగ్‌శాఖ ద్వారా తవ్వకాలు జరిపి సంబంధిత సమీప ప్రాంతాల ప్రజలకు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్ర: ఒంగోలు వైద్యశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడతున్నారు కలెక్టర్: ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణలో అనధికారికంగా ఆక్రమించుకున్న షాపులను ఖాళీచేయించాం. వాటిని వేలం వేయడం ద్వారా ఆసుపత్రి అభివృద్ధి నిధిని పెంచుకుంటాం. అంతేకాకుండా దిగువ అంతస్తులో ఉన్న రక్షిత మంచినీటిని ప్రతి అంతస్తులోను పొందేందుకే వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అంతే కాకుండా ఏరియా వైద్యశాలలకు సైతం ఎక్స్‌రే మిషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈమేరకు ఇటీవలే డీసీహెచ్ఎస్కు లేఖ కూడా పంపాం. -
ఫలించిన పోరాటం!
రెండు దశాబ్దాల క్రితం పచ్చని పంటలతో కళకళలాడిన సాగు భూములు కొందరి స్వార్ధ రాజకీయాల కారణంగా బీడుగా మారిపోయాయి. సాగు నీరు అందక, పంటలు ఎండిపోవటంతో వేలాది మంది రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇతర జిల్లాలకు నాణ్యమైన ధాన్యం ఎగుమతి చేసిన వారు తిండి గింజల కొనుక్కోవాల్సిన దుర్భర స్థితికి దిగజారారు. ఇది పాలేరు–బిట్రగుంట సప్లై ఛానల్ (పీబీ ఛానల్) కింద సాగు చేసుకుంటున్న రెండు మండలాల రైతుల దీనగాథ. గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల నిర్లక్ష ధోరణి వల్ల ఏర్పడిన ఈ సమస్యకు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు నెలలకే పరిష్కారం లభించింది. రైతుల మోముల్లో ఇప్పుడు ఆనందం తొణికసలాడుతోంది. దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటం ఫలించి ఛానల్ ద్వారా తమ పొలాలకు సాగు నీరు అందుతుందనే సంతోషం నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని కందుకూరు మండలం జిల్లెళ్ళమూడి– జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామాల మద్య పాలేరుపై 1960లో పాలేరు–బిట్రగుంట సప్లై ఛానల్ నిర్మించారు. 0.73 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో జిల్లెళ్ళమూడి గ్రామం వద్ద పీబీ ఛానల్‌కు చెందిన ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నుంచి ఛానల్‌ను నిర్మించి ఆ ఛానల్ ద్వారా సింగరాయకొండ మండలంలోని పాకల, కలికవాయ, బింగినపల్లి, సోమరాజుపల్లె, పాత సింగరాయకొండ, మూలగుంటపాడు, సింగరాయకొండ గ్రామాలతో పాటు జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట గ్రామాలకు సాగు నీటిని అందించే విధంగా నిర్మాణం చేపట్టారు. అందుకుగాను సింగరాయకొండ మండలంలో 7 చెరువులు, జరుగుమల్లి గ్రామంలో ఒక చెరువు నిర్మించి వాటిని నింపటం ద్వారా ఈ 9 గ్రామాలకు సాగు నీరు ఇచ్చేలా రూపకల్పన చేశారు. 1996 వరకు ఈ ప్రాంతం పచ్చన మాగాణి పొలాలతో పాటు ఆరుతడి పంటలకు కూడా ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన భారీ వరదల వల్ల ఛానల్‌కు సంబంధించిన ఆనకట్టకు సమానంగా ఇసుక మేట వేయటంతో నీటి నిల్వ సామర్ధ్యం పూర్తిగా తగ్గిపోయి చెరువులకు నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఛానల్ కింద సుమారు 10 వేల ఎకరాల సాగు భూమి నేడు బీడు భూములుగా మారిపోయాయి. 1996 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. గతంలో కలెక్టర్ సుజాత శర్మ ఇసుక తవ్వకాల కోసం ప్రయత్నించటంతో ఆనకట్టలో బోర్లు వేసిన కొందరు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. ఆ తరువాత కోర్టు స్టే తొలగించినప్పటికీ అధికారులు ఇసుక తవ్వకుండా వదిలేశారు. దీంతో గతంలో నాణ్యమైన సన్నబియ్యంతో పాటు బాసుమతిలాంటి ఖరీదైన బియ్యాన్ని ఎగుమతి చేసిన అక్కడి రైతులు ప్రస్తుతం తిండి గింజలు, పశువుల మేత కొనుక్కోవాల్సిన దుర్భర స్థితిలోకి వెళ్లారు. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. ఇసుక మేటలను తొలగించమంటూ రైతు సంఘాల నాయకులతో కలిసి ఏళ్లతరబడి అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం వీరి గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా మంచి రోజులు రాకపోతాయా అంటూ అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడవకముందే ఆనకట్టలో వేసిన ఇసుక మేటలను తవ్వి జిల్లాలో ఇసుక కొరతను తీర్చటంతో పాటు రైతుల ఇబ్బందులను సైతం తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆనకట్టలోని ఇసుక మేటలను తవ్వి జిల్లాలో ఇసుక కొరతను తీర్చేందుకు సమాయత్తం అయ్యారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్ షాన్మోహన్లు ఇసుక మేట వేసిన ప్రాంతాలను పరిశీలించి ఇసుక తవ్వకాలకు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ తవ్విన ఇసుకను జిల్లాలోని కందుకూరు, కనిగిరి, ఒంగోలులలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించి అక్కడ నుంచి ప్రజలకు ఇసుకను సరఫరా చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో ప్రజలు పడుతున్న ఇసుక కష్టాలు తీరడంతో పాటు దశాబ్దాలుగా పిబి ఛానల్ పరిధిలో వేలాది మంది రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగి, వారి లోగిళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇండస్ట్రియల్ హబ్‌గా దొనకొండ
సాక్షి, దొనకొండ: జిల్లా వాసులను ఊరిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ కల నెరవేరనుంది. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను పిలిచి వివరాలు సేకరించిన సీఎం వైఎస్ జగన్ పూర్తి సమాచారంతో మరోసారి రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోని దొనకొండ, కురిచేడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేయడం మినహా ఒక్క అడుకూడా ముందుకు వేయని పరిస్థితి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా గడవక ముందే జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అయితే పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా రూపు రేఖలే మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పరిశ్రమలు నిర్మించేందుకు అణువైన రోడ్డు, రైలు మార్గాలు, సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎంత దూరంలో ఉంది, విద్యుత్ సౌకర్యం, భౌగోళిక స్వరూపం వంటì పూర్తి వివరాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ, కుర్చేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. నిరుద్యోగులకు వరం.. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనుకున్న ప్రకారం దొనకొండలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు జరిగితే యువతకు ఉద్యోగాలకు కొదువే ఉండదు. నిరుద్యోగ సమస్య దాదాపుగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు. కలెక్టర్ పరిశీలన.. కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం సాయంత్రం దొనకొండ మండలంలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రుద్రసముద్రం, రాగమక్కపల్లి, భూమనపల్లి, కొచ్చెర్లకోట, పోచమక్కపల్లి, ఇండ్లచెరువు, బాదాపురం రెవెన్యూ గ్రామాల్లోని భూములు పరిశీలించారు. లైసెన్స్ సర్వేయర్ సీహెచ్ వెంకట్రావు హబ్‌కు సంబంధించిన ప్రాంతంలోని మ్యాపు గురించి వివరించారు. ఏపీఐఐసీ వారికి సుమారు 25 వేల ఎకరాలు రెవెన్యూ వారు తయారు చేయటం జరిగిందన్నారు. 2490 ఎకరాలు ఏపీఐఐసీ వారికి అప్పగించారు. అందులో టైటాన్ ఏవియేషన్ విమానాల విడిభాగాల పరికరాల కేంద్రానికి 6 వేల ఎకరాలు, కార్ల సామాగ్రి శక్తి సామర్థ్యం కేంద్రానికి 2300 ఎకరాలు, ప్రైడ్ ప్రాజెక్టు గృహ నిర్మాణాలు, ఇంటర్నల్ వస్తు విభాగాల నిర్మాణ సంస్థకు 5 వేల ఎకరాలు, విదేశీయులు చూసి వెళ్లటం జరిగిందన్నారు. మండల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, విద్యుత్, రవాణా గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దొనకొండ నుంచి మార్కాపురానికి రూట్, వాటి మధ్య దూరం, దొనకొండ 6 వే రోడ్డు, కర్నూలు, గుంటూరు, కనిగిరి జంక్షన్ ఎన్ని కిమీ ఉంటుందనే వివరాలు మ్యాపు ద్వారా తెలుసుకున్నారు. మండల పరిధిలో రైల్వే ట్రాకులు ఎంత విస్తీర్ణంలో వెళ్తుంది. ట్రాకు వెలుపల, బయట ఉన్న గ్రామాలు గురించి క్షుణ్ణంగా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దొనకొండ రావటం జరిగిందని, ఎప్పుడైనా ప్రభుత్వం హబ్ గురించి అడిగితే తాము చెప్పటానికి ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. ఆయన వెంట జేసీ ఎస్.షన్మోహన్, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ నరసింహారావు, సర్వేయర్ అసిస్టెండ్ డైరెక్టర్ జయరాజు, తహసీల్దార్ పాలడుగు మరియమ్మ, సర్వేయరు కె.దర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
వెలిగొండతోనే ప్రకాశం
సాక్షి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. ప్రాజెక్టుతో ప్రధానంగా సాగు, తాగునీటి ఇబ్బందులు తీరతాయని, తద్వారా పరిశ్రమలు తరలివచ్చే అవకాశముందని ఆయన ప్రభుత్వానికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సోమవారం విజయవాడలో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు పోలా భాస్కర్ హాజరుకానున్నారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేసిన ఆయన సోమవారం ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితోనే ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నాటికి ఫేజ్–1 పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారు. ఆ మేరకు ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ఫేజ్–1 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. వెలిగొండ పరిధిలో ప్యాకేజీకి సంబంధించి రూ.450 కోట్లు, భూసేకరణకు రూ.240 కోట్లు, సాగర్ పరిధిలో 132 కేవీ విద్యుత్‌లైన్ రీలొకేట్ చేసేందుకు రూ.304 కోట్లు, ఇన్ప్రాస్టక్చర్, గృహాల నిర్మాణానికి కలిపి రూ.450 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించనున్నారు. దీంతో పాటుగా టన్నెల్–1 నిర్మాణానికి రూ.250 కోట్లు, హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.50 కోట్లు, ఫీడర్ కెనాల్ లైనింగ్‌కు రూ.130 కోట్లు చొప్పున రూ.450 కోట్లు అవసరమని ఇరిగేషన్ అధికారులు నివేదించారు. ఈ నిధులతో 8 లేఅవుట్ కాలనీల నిర్మాణం చేసి నీటిని విడుదల చేసే లోపు పూర్తి చేయాల్సివుంది. వెలిగొండ పూర్తయితే జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందుతుందని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వెలిగొండ నీళ్లు వస్తే కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక వాడలు పూర్తి చేయవచ్చన్నారు. రూ.56 కోట్లు కేటాయిస్తే ఏపీఐఐసీ ద్వారా నిమ్జ్‌కు భూసేకరణ పూర్తి అవుతుందన్నారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరువుసాయం రూ.398 కోట్లు.. జిల్లాకు కరువు సాయం రూ.398 కోట్లు రావాల్సి ఉందని దానిని వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ భాస్కర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రధానంగా గ్రామీణ తాగునీటి రంగానికి సంబంధించి రూ.66 కోట్లు, పట్టణ తాగునీటికి సంబంధించి రూ.31.73 కోట్లు, వ్యవసాయరంగానికి సంబంధించి రూ.236 కోట్లు, పశుసంవర్దక శాఖకు సంబంధించి రూ.57.38 కోట్లు చొప్పున గత ఏడాధి రెండు సీజన్లకు సంబంధించిన పరిహారం రావాల్సి ఉందని, ఇది రిలీజ్ చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. సాగర్ ఆధునీకరణ నిధులు కోసం.. గతంలో నాగార్జున సాగర్ కుడికాలువ ఆధునీకరణ పనులు రూ.73.69 కోట్లతో చేపట్టారని 47 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని మిగిలి ఉన్న 53 శాతం పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్‌కు చివరి ఆయకట్టుకు నీటిని ఇవ్వవచ్చని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రూ.47 కోట్లు నిధులు ఇస్తే మిగిలిన పనులు పూరి చేస్తామన్నారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీకి భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కలెక్టర్ నివేదించారు. ఈ ఏడాది ఒంగోలులోనే తాత్కాలిక భవనంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భోదన నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. యూనివర్సిటీకి సైతం భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అవసరమై నిధులు కేటాయిస్తుందన్నారు. వీటితో పాటు కలెక్టర్ల సదస్సులో గ్రామ సచివాలచ ఏర్పాటు, పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల నియామకాలు, పౌరసరఫరాల శాఖ ద్వారా సక్రమంగా నిత్యావసర సరుకుల పంపిణీ, అమ్మఒడి, పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సర్వశిక్షా అభియాన్ ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పెన్షన్లు తదితర అంశాలను సీఎం కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. -
విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలకు కార్యాచరణ
♦ అధికారులతో సమీక్షలో టీటీడీ ♦ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తిరుపతి అర్బన్/తిరుమల: తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలను విదేశాల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ వెల్లడించారు. శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ విదేశాల్లో ఎప్పుడు స్వామివారి వైభవోత్సవాలను నిర్వహించినా వారాంతంలో రెండురోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వైభవోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే నమూనా ఆలయాల్లో శ్రీవారి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల విగ్రహాలను నూతనంగా తయారు చేయాలని చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డికి జేఈవో సూచించారు. నిర్ధేశిత విభాగాల నుంచి 30 మంది సిబ్బందికి మించకుండా విదేశీ యాత్రకు సిద్ధంగా ఉండాలన్నారు. వెంకన్న దర్శనానికి 12 గంటలు వేసవి సెలవులతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటరు మేర క్యూ ఉంది. వీరికి 12 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం కలగనుంది. -
ముగిసిన కళానీరాజనం
తిరుపతి కల్చరల్ : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కళానీరాజనం తుది విడత పోటీ లు సోమవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కళానీరాజనం సంగీత పోటీలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమశ్రేణి కళాకారులను గుర్తిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎంపిక చేసిన కళాకారుల వివరాలను నిక్షిప్తం చేసి, నాదనీరాజనం, శ్రీవారి సేవలు, టీటీడీ ఆలయాల ఉత్సవాల్లో అవకాశం కల్పిస్తామన్నారు. సంగీత పోటీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఒకవైపు వేర్వేరు ప్రాంతాల్లో పోటీలు నిర్వహణ, మరో వైపు ఎంపికైన వారికి టీటీడీ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించడం సమాంతరంగా జరుగుతుందన్నారు. సంగీత పోటీలు నిర్వహించడం ద్వారా మన సం స్కృతి పరిరక్షణకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. కళానీరాజనంలో ప్రతిభ కనబరిచిన మొదటి శ్రేణి కళాకారులకు ప్రతిష్టాత్మకమైన నాదనీరాజనం కార్యక్రమంలో, రెండో శ్రేణి వారికి తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహించే ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకారసేవ వంటి సేవల్లో, మూడో శ్రేణిలోనున్న వారికి టీటీడీ ఆలయా ల్లో నిర్వహించే అన్ని ఉత్సవాల్లో ప్రదర్శనలకు అవకాశమిస్తామని తెలిపారు. పోటీల న్యాయనిర్ణేత ప్రముఖ వీణ విద్వాంసుడు పుదుక్కోటై ఆర్.కృష్ణమూర్తి మాట్లాడుతూ వర్తమాన కళాకారులకు స్వరజ్ఞానం అవసరమన్నారు. మంచి గురువు సమక్షంలో చక్కగా సాధన చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. ప్రముఖ సంగీత విద్యాంసుడు అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ ఎంత నేర్చుకున్నా కళాకారులు నిరంతరం సాధన చేస్తూ నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. కాగా, చివరిరోజు ఉద యం నిర్వహించిన సంగీత, వాయిద్య పోటీల్లో చిత్తూరుకు చెందిన 15 మంది యువకళాకారులు ప్రతిభ చాటారు. మధ్యాహ్నం చేపట్టిన నృత్య ప్రదర్శనల్లో మరో 15 మంది కళాకారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో చక్కటి ప్రతిభా పాటవాలతో అలరించారు. ప్రముఖ సంగీత విద్యాంసులు కన్యాకుమారి, పుదుక్కోటై రామనాథన్, దేవేంద్రపిళ్ళై, డాక్టర్ శర్మ ఉషారాణి, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శబరిగిరీష్, వందన న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డీపీపీ ప్రత్యేక అధికారి రఘునాథ్, ట్రాన్స్‌పోర్టు జీఎం పీవీ. శేషారెడ్డి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ వైవీఎస్.పద్మావతి, ఎస్వీబీసీ తమిళ ప్రసారాల అధికారి పాల్గొన్నారు. -
అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనం
అమ్మవారి దర్శన సమయంలో మార్పు జేఈవో పోలా భాస్కర్ తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తరహాలో బ్రేక్ దర్శనం అమలుచేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం అమ్మవారి ఆస్థాన మండపంలో అర్చకులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనం(కుంకుమార్చన) ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దాదాపు గంట సమయం పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతిరోజూ (శుక్రవారం మినహా) ఉదయం 5 గంటలకు అమ్మవారి ఆలయాన్ని తెరుస్తున్నారని, త్వరలోనే వేకువజామున 4.30 గంటలకు అమ్మవారి ఆలయం తీసేందుకు సన్నాహాలు చేపడతామన్నారు. అలాగే రాత్రి (శుక్రవారం మినహా) 8.45 గంటలకు నిర్వహించే ఏకాంతసేవను 9.30 గంటలకు నిర్వహించాలనే విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. బ్రేక్ దర్శనం.. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకునేం దుకు భక్తులు ఇష్టపడుతుంటారని, ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు గంటల పాటు బ్రేక్ దర్శనం అమలు చేసి ఆ సమయంలో కుంకుమార్చన సేవ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ దర్శనంలోనే రూ.100 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులను సైతం అనుమతిస్తామని పేర్కొన్నారు. అపవాదును తొలగించుకునేందుకే... ప్రొటోకాల్‌కు అనుగుణంగా వీఐపీలకు అన్ని మర్యాదలతో దర్శనం చేయించాల్సి వస్తోందన్నారు. ఇవేమి తెలియని సామాన్య భక్తుల నుంచి టీటీడీ అధికారులు కొందరికే పరిమితమవుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారని తెలిపారు. ఈ అపవాదును తొలగించుకునేందుకే బ్రేక్ దర్శనం అమలు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల తరహాలోనే అమ్మవారిని బ్రేక్ దర్శనంలోనే వీఐపీలు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పద్ధతికి అలవాటు పడేలా అంచెలంచెలుగా బ్రేక్ దర్శనాన్ని అమలుచేయనున్నట్లు వెల్లడించారు. -
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
8 నుంచి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు అధికారులతో సమీక్షించిన జేఈవో పోలా భాస్కర్ తిరుచానూరు, న్యూస్‌లైన్ : వడమాల పేట మండలం అప్పలాయగుంటలో వె లసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ పిలుపునిచ్చారు. జూన్ 8 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం ఆలయ ప్రాంగణంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. జూన్ 11న నిర్వహించే కల్యాణోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లావ్యాప్తంగా 15 ప్రముఖ ఆలయాల నుంచి స్వామికి వస్త్రాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 12న జరిగే గరుడసేవకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసులహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులను అందించాలని ఆదేశించారు. జూన్ 4 నుంచి తిరుపతి పరిసర గ్రామాలకు ప్రచార రథాలను పంపి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తిభావం వెల్లివిరిసేలా ధార్మికోపన్యాసాలు, హరికథలు, జానపద కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నుంచి ప్రతి అరగంటకో బస్సు నడపాలని, గరుడసేవ, రథోత్సవం రోజుల్లో వీటి సంఖ్యను పెంచాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించా రు. పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలని, మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమీక్ష సమావేశంలో స్థానిక ఆలయాల స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, డీపీపీ ప్రత్యేకాధకారి రఘునాథ్, ఎస్టేట్ అధికారి దేవేందర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో బాలాజీ, ఎస్వీ గోశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, ఏఈవో నాగరత్న, ఆలయ ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి కల్యాణాలపై ప్రత్యేక నిఘా
తిరుపతి, న్యూస్‌లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై టీటీడీ స్పందించిం ది. కల్యాణోత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ కల్యాణోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్క ర్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కల్యాణోత్సవం ప్రాజె క్టు, కల్యాణాల నిర్వహణపై జేఈవో అధ్యక్షతన శనివా రం శ్వేత భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. కల్యాణోత్సవాల నిర్వహణకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించా రు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఆయా సంస్థలపై పరిశీలన, వేదిక ఖరారు, నిర్వహణ, కల్యాణోత్సవ అనంతరం ఖర్చు తదితర అంశాలపై పర్యవేక్షిం చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమి టీ సూచన మేరకే కల్యాణోత్సవాన్ని ఖ రారు చేస్తారు. డొనేషన్ ఎవరి నుంచి తీసుకోవాలి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అలాంటివాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణరుుంచారు. డొనేషన్ తీసుకునే వారి వివరాలు పూర్తిగా సేకరించి ఏడాది కాలానికి ప్రత్యేక కేలండర్‌ను రూపొందిస్తారు. దీనికి అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ కల్యాణోత్సవం నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. అదేవిధంగా కల్యాణోత్సవం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాల్లో భక్తులు సమర్పించే ప్రతి కానుక టీటీడీ కి అప్పగించాల్సిందేనని అధికారులు సూచించారు. శ్రీనివాస కల్యాణం, గోవింద కల్యాణాలు వేర్వేరుగా కాకుండా ఒక పేరుతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ నిర్వహణ కేవలం ప్రత్యేక అధికారి కాకుండా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిందేనని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో అందజేస్తారు. అనంతరం ఈవో నిర్ణయం మేరకు కల్యాణోత్సవాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు అధికారులు చెప్పారు.