సాక్షి, ప్రకాశం: జిల్లాలో 280 నుండి 300 మంది వరకు న్యూఢిల్లీలో మత ప్రార్ధనలకు వెల్లారని కలెక్టర్ పోలా బాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరిలో ఇప్పటీ వరకు 132మందిని గుర్తించి వారి శాంపిల్స్‌ను తెలుగు రాష్ట్రంలోని వివిధ ల్యాబరేటరిలకు పంపించామని తెలిపారు. అందులో 96 శాంపిల్స్‌ను పరిశీలించగా 8మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ఇక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటోన్మెంట్ టాస్క్ ఆపరేషన్ మొదలు పెట్టి ప్రత్యేక అధికారులను కేటాయించామన్నారు. మార్కాపురం, ఒంగోలు ఇస్లాంపేటకు సంబంధించిన రిపోర్ట్స్ రావలసి ఉందని అయితే కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక మూడు రైళ్లలో వారంతా ప్రయాణించినట్లు గుర్తించామని తెలిపారు. కందుకూరు, కనిగీరి, మార్కాపురం పట్టణాలను రిస్క్ జోన్లుగా ప్కటించామని చెప్పారు. (కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!)
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కేంద్రం అయిన ఒంగోలులోని కిమ్స్, సంఘమిత్ర, వంటి నాలుగు ప్రధాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. వారంతా ఢిల్లీకి వెళ్లడంపై ఆరా తీస్తున్నామని, వారితో సంభందం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వసతి సదుపాయం కల్పించడానికి ఓ లాడ్జినీ తీసుకున్నామన్నారు. 12నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క టి చొప్పున క్వారంటైన్ వార్డులను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ క్వారంటైన్ వార్డుకి ఒక మెడికల్ అధికారిని నియమించామని, పోలీసులు, రెవిన్యూ, వైద్య మూడు విభాగాలు మండల స్ధాయి నుండి కో-ఆర్డినెషన్ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నామన్నారు. కాగా ప్రజలు ఎవ్వరు కూడా కోవిడ్-19పై భయబ్రాంతులకు గురికావద్దని.. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, తగిన స్ధాయిలో నిలువలు ఉన్నాయి చెప్పారు. అయితే వారితో కలిసి ఢిల్లీకి మతప్రార్ధనలకు వెళ్లోచ్చిన వారంతా స్వచ్చందంగా ముందుకు వస్తే వారందరి వైద్యం అందిస్తామని కలెక్టర్ పిలుపు నిచ్చారు. (‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’)
Comments
Please login to add a commentAdd a comment