PRAKSAM
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
మర్రిపూడి:ప్రకాశం జిల్లా మర్రిపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు విచక్షణా రహితంగా కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఘటనలో బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పొదిలి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మర్రిపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 398లో 12.80 ఎకరాల భూమి ఉంది. పూరీ్వకుల నుంచి సంక్రమించిన ఈ భూమిని 1940వ సంవత్సరం నుంచి అదే గ్రామానికి చెందిన గొంటు వంశీకులైన గొంటు పెద యోగిరెడ్డి, గొంటు చినయోగిరెడ్డి, గొంటు వెంకట నర్శింహారెడ్డి, గొంటు శివారెడ్డి సాగుచేసుకుంటున్నారు. అయితే, 1957వ సంవత్సరంలో జరిగిన రీ సర్వేలో గ్రామానికి చెందిన గొంటు వెంకటనర్శింహారెడ్డి, గొంటు శివారెడ్డి, చేరెడ్డి పెద కోటిరెడ్డి పేర్లు ఎఫ్‌ఎల్‌ఆర్‌లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన గొంటు శివారెడ్డి గతేడాది వైఎస్సార్ సీపీలో చేరారు. దీన్ని జీరి్ణంచుకోలేక కక్షకట్టిన టీడీపీ వర్గీయులు ఎఫ్‌ఎల్‌ఆర్ దాఖలాలో ఉన్న చేరెడ్డి పెదకోటిరెడ్డి వంశీకుడైన చేరెడ్డి పుల్లారెడ్డి సాగుచేసుకుంటున్న భూమిలో తమకు కూడా మూడో వంతు వాటా రావాలంటూ గొంటు వంశీయులకు నోటీసులు పంపించారు. ఈ విషయంపై గురువారం స్థానిక శివాలయం వద్ద పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్న తరుణంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేరెడ్డి చిన్న నర్సారెడ్డితో పాటు వారి వర్గీయులు కలుగజేసుకుని వైఎస్సార్ సీపీ వర్గీయులపై కర్రలతో దాడి చేశారు. దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గొంటు శివారెడ్డి, గొంటు సుమాంజలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ పీ అంకమ్మరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా నిబంధనలు ఉల్లఘింస్తూ లోకేష్ ర్యాలీ
సాక్షి, ప్రకాశం: కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ మార్కాపురం నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. కరోనావైరస్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కేంద్రం రాజకీయ పార్టీ ల ర్యాలీలకు అనుమతించకపోయినప్పటికీ, నిబంధనలు పాటించకుండానే లోకేష్ ర్యాలీకి టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండానే తిప్పాయపాలెం హైవే నుంచి తాడిపత్రి వరకు టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. (చదవండి : కరోనా: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు) -
వారంతా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లారు: కలెక్టర్
సాక్షి, ప్రకాశం: జిల్లాలో 280 నుండి 300 మంది వరకు న్యూఢిల్లీలో మత ప్రార్ధనలకు వెల్లారని కలెక్టర్ పోలా బాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీరిలో ఇప్పటీ వరకు 132మందిని గుర్తించి వారి శాంపిల్స్‌ను తెలుగు రాష్ట్రంలోని వివిధ ల్యాబరేటరిలకు పంపించామని తెలిపారు. అందులో 96 శాంపిల్స్‌ను పరిశీలించగా 8మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ఇక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటోన్మెంట్ టాస్క్ ఆపరేషన్ మొదలు పెట్టి ప్రత్యేక అధికారులను కేటాయించామన్నారు. మార్కాపురం, ఒంగోలు ఇస్లాంపేటకు సంబంధించిన రిపోర్ట్స్ రావలసి ఉందని అయితే కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక మూడు రైళ్లలో వారంతా ప్రయాణించినట్లు గుర్తించామని తెలిపారు. కందుకూరు, కనిగీరి, మార్కాపురం పట్టణాలను రిస్క్ జోన్లుగా ప్కటించామని చెప్పారు. (కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కేంద్రం అయిన ఒంగోలులోని కిమ్స్, సంఘమిత్ర, వంటి నాలుగు ప్రధాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. వారంతా ఢిల్లీకి వెళ్లడంపై ఆరా తీస్తున్నామని, వారితో సంభందం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వసతి సదుపాయం కల్పించడానికి ఓ లాడ్జినీ తీసుకున్నామన్నారు. 12నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క టి చొప్పున క్వారంటైన్ వార్డులను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ క్వారంటైన్ వార్డుకి ఒక మెడికల్ అధికారిని నియమించామని, పోలీసులు, రెవిన్యూ, వైద్య మూడు విభాగాలు మండల స్ధాయి నుండి కో-ఆర్డినెషన్ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నామన్నారు. కాగా ప్రజలు ఎవ్వరు కూడా కోవిడ్-19పై భయబ్రాంతులకు గురికావద్దని.. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, తగిన స్ధాయిలో నిలువలు ఉన్నాయి చెప్పారు. అయితే వారితో కలిసి ఢిల్లీకి మతప్రార్ధనలకు వెళ్లోచ్చిన వారంతా స్వచ్చందంగా ముందుకు వస్తే వారందరి వైద్యం అందిస్తామని కలెక్టర్ పిలుపు నిచ్చారు. (‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’) -
ఆందోళన వద్దు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చీరాలో వెలుగు చూసిన రెండు కరోనా పాజిటివ్ కేసుల వ్యక్తులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. (పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా ప్రస్తుతం వారి రిపోర్టులు రావాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెల్లోచ్చిన బృందంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. దీనిపై ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన పడొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి సూచించారు. (ఇంటికెళ్లాలని ఉంది: కనికా కపూర్) -
పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ
సాక్షి, చీరాల : చిట్టీలు, అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి రూ.16 కోట్లు వసూలు చేసిన టీడీపీ కీ లేడీని ఎట్టకేలకు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలిగా వ్యవహరిస్తూ ఆమె చేసే అక్రమాలకు కలరింగ్ ఇచ్చుకుంది. తన వెనుక రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని సొంత బిల్డప్లకు దిగింది. తీరా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదహారు కోట్ల రూపాయలకుకు టోకరా పెట్టింది. ఇందులో పేద, మధ్య తరగతి వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, పోలీసులు, ఆర్మీ ఉద్యోగులు, రైతులు ఉన్నారు. ఈ మాయ లేడీ వ్యవహారంపై ముందుగానే సాక్షి దినపత్రికలో రెండు కథనాలు ప్రచురితమయ్యాయి. మహిళా మేత శీర్షికతో పాటు ఆమె బాధితులు చాంతాడంత అనే మరో శీర్షికతో సాక్షి రెండు కథనాలు ప్రచురించింది. ఈపూరుపాలేనికి చెందిన బాధితులు ఇద్దరు తమను మహిళా నేత ఛీటింగ్ చేసిందని ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీలకు ఆశచూపి రూ.16 కోట్లకు టోకరా వేసిన సదరు మహిళపై ఈపూరుపాలెం రూరల్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ వేముల సుధాకర్ తన సిబ్బందితో కలిసి చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి (ఇతను ప్రభుత్వ ఉద్యోగి) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదీ..జరిగింది చీరాల రూరల్ మండలం ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి చిట్టీల వ్యాపారం చేస్తోంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ మాయలేడీ రూ.16 కోట్లకు అప్పులు చేసి ఎగనామానికి సిద్ధపడింది. ఈపూరుపాలెంలో ఉన్నత కుటుంబంగా వ్యవహరిస్తూ చిట్టీల వ్యాపారం చేయడంతో పాటు చిట్టీలను వేసిన వారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తానని నమ్మబలికింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, పేరాల, చీరాల, పిట్టువారిపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రజలు అధికంగా చిట్టీ పాటలు వేశారు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు చిట్టీ పాటలు వేయడంతో పాటు చిట్టీలు పాడిన వారి నుంచి అధికంగా వడ్డీలు చెల్లిస్తామని నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. 15 నెలలుగా సదరు మహిళ చిట్టీలు పాడిన వారికి నగదు చెల్లింపులు చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఇదే కోవలో డబ్బులు వడ్డీకి ఇచ్చిన వారు సైతం తమ డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను కోరగా వారికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తోంది. సదరు మహిళ వద్ద అధికంగా రోజువారీ కూలీలు, ఐఎల్టీడీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్‌దారులు 500 మంది వరకు చిట్టీలతో పాటు అధిక వడ్డీలకు ఆశపడి నగదు ఇచ్చారు. గత సంవత్సరం నుంచి ఆ మాయాలేడీ వ్యవహారంపై అనుమానం వచ్చిన ప్రజలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రతిఫలం లేకుండా పోతోందని వాపోతున్నారు. అక్రమార్కురాలికి టీడీపీ నేతల అండ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేసీ తీరా తన వద్ద డబ్బులు లేవంటూ నాటకాలు ఆడుతున్న సదరు మహిళ టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. తనను ఈ వ్యవహారం నుంచి రక్షించాలని స్థానిక నేతలతో పాటు నియోజకవర్గ ముఖ్యనేతల చుట్టూ తిరుగుతోంది. ఈ జనానికి తాను అంత డబ్బు ఇవ్వలేనని, తన ఇంటిని అమ్ముతానని, తాను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తానని స్థానిక నేతలను వెంట పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలను తరుచూ కలుస్తోంది. పందిళ్లపల్లి టూ కర్లపాలెం వరకు బాధితులే ఈ మహిళా నేత బాధితుల చిట్టా చాంతాడంత పేరుకుపోయింది. చీరాల మండలం మేజర్ గ్రామం ఈపూరుపాలెంలో చిట్టీలు వేస్తున్న ఈ మహిళ వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, మాస్టర్ వీవర్లు నుంచి కోట్లాది రూపాయలు అధిక వడ్డీలు ఆశ చూపించి వసూలు చేసింది. ఈ మహిళా మేత బాధితులు చీరాల నియోజకవర్గం చివరలోని పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట, వేటపాలెం, చీరాల, పేరాల, ఈపూరుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి, బాపట్ల, కర్లపాలెంలో ఉన్నారు. ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ఈపూరుపాలెంలో ప్రజల నుంచి రూ.16 కోట్లకుపైగా డబ్బులు వసూలు చేసిన మాచర్ల పద్మావతిపై ముందుగానే ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తమను పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మోసం చేశారని బాధితులు చాలామంది ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె బాధితులు చాంతాడంత పేరుకుపోవడంతో పాటు పలువురు కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నా మాయా లేడీ కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. అవును..విచారిస్తున్నాం ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిలు చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. తమను మోసం చేశారని గ్రామానికి చెందిన ఇద్దరు పద్మావతి కుటంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సదరు మహిళ, ఆమె భర్తను విచారిస్తున్నాం. – సుధాకర్, ఎస్ఐ, ఈపూరుపాలెం -
రైతు కుటుంబానికి త్రీమెన్ కమిటీ పరామర్శ
సాక్షి, బల్లికురవ(ప్రకాశం) : పొలంలో జెండాలు పాతి వేలం నోటీసులివ్వడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని ఉన్నతాధికారులు నియమించిన త్రీమెన్ కమిటీ సోమవారం పరామర్శించింది. మండలంలోని కె.రాజుపాలేనికి చెందిన శాఖమూరి హనుమంతురావు (42) కొంతకాలంగా మార్టూరు మండలం శాంతినగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని భార్య, పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామం కె.రాజుపాలెంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శాఖమూరి హనుమంతురావు శనివారం ఉదయం పొలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్వగ్రామానికి వచ్చి వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కుపాల్పడ్డాడు. ఈ ఘనటపై ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ టి.ప్రశాంతి, వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి, ఎస్ఐ పాడి అంకమ్మరావులు శాంతినగర్‌లోని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు భార్య రాధిక నుంచి వివరాలు సేకరించారు. మార్టూరు పీడీసీసీ బ్యాంకులో నాలుగేళ్ల క్రితం తీసుకున్న అప్పు రూ. 1.80 లక్షలు వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు, స్టేట్ బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటు వ్యాపారుల వద్ద మరో రూ.3 లక్షల అప్పు ఉందని మృతుడి భార్య చెప్పింది. పీడీసీసీ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేయడంతో తన భర్త మానసికంగా ఇబ్బంది పడ్డాడని ఆరోపించింది. పొలంలో జెండాలు పాతి 3వ తేదీన పొలం వేలం వేస్తున్నట్లు మేనేజర్ బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత రైతు భార్య త్రీమెన్ కమిటీ ఎదుట వాపోయింది. తన బిడ్డలు హర్షవర్ధన్ ఇంటర్, నందిని 9వ తరగతి చదువుతున్నారని పేర్కొంది. చదువులకు విఘాతం కలగకుండా అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరింది. నోటీస్‌లు ఇవ్వడంతో పాటు పొలంలో జెండాలు పాతిన పీడీసీసీ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాధిక త్రీమెన్ కమిటీని వేడుకుంది. -
సీఎంను నిలదీయండి
ఒంగోలు (ప్రకాశం): జిల్లా అభివృద్ధికి ఇప్పటి వరకు ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు జిల్లాకు వస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వచ్చిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం మినహా ఏ ఒక్కదానిని నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాలుగేళ్లు గడిచినా ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. తాజాగా రూ.700 కోట్లతో టెండర్లు పిలవనున్నట్లు పేర్కొంటున్నారని, నాలుగేళ్ల కాలంలో 3.6 కిలోమీటర్లు పూర్తి చేసి, మిగిలిన 3 కి.మీకుపైగా పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా..? అని ప్రశ్నించారు. జిల్లాలోని గుండ్లకమ్మ మిగులు పనులు, సంగమేశ్వరం, చేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా..? అని ప్రశ్నించారు. జిల్లాలోని గుండ్లకమ్మ మిగులు పనులు, సంగమేశ్వరం, కొరిశపాడు యర్రం చిన పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తిగా నత్తనడకనే సాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేపట్టకపోగా జిల్లాకు కేంద్రం ప్రకటించిన పథకాలను సైతం ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. నిమ్జ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2015–16లో అంగీకరించినా నేటివరకు భూములను స్వాధీనం చేయకపోవడం, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఎందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో కూడా ప్రతిపాదనలు పంపితే పోర్టు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం ప్రకటించినా చంద్రబాబు మాత్రం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో కుమ్మక్కై రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.మూడు వేల ఎకరాలు మాత్రమే కేంద్రం కోరుతుండగా నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. చీరాలలో మరో పోర్టు నిర్మిస్తామంటే తాము అడ్డుకాదని, రెండు పోర్టులు నిర్మించడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందనేదే తమ భావన అన్నారు. 2015–16, 2016–17 సంవత్సరాలలో ఎంపీగా తాను సూరారెడ్డిపాలెం, సింగరాయకొండ, ఒంగోలు అగ్రహారం, గిద్దలూరు టౌన్ పరిధిలో నాలుగు ఆర్వోబీ/ఆర్యూబీలకు అనుమతులు తీసుకువచ్చానని చెప్పారు. కానీ వాటికి అప్రోచ్ అంచనాలు పంపడంలో నేటికి జిల్లా యంత్రాంగాలు ముందుకు రాకపోవడం శోచనీయం అన్నారు. ఒంగోలులో ఈఎస్సై ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినా ఎకరం స్థలం చూపలేకపోవడం వల్ల నేటికీ అది కార్యరూపం దాల్చకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం: 2017 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతాంగానికి సైతం ఇంతవరకు పరిహారం అందలేదని, 2015లో శెనగలు కోల్డు స్టోరేజీలలో ఉన్నపుడు తాము కేంద్ర మంత్రిత్వశాఖతో మాట్లాడినందువల్లే కేంద్రం ముందుకు వచ్చి శెనగలను కొనుగోలుచేసిందన్నారు. గత ఏడాది శెనగలు సైతం నేడు కోల్డు స్టోరేజీలలోనే ఉన్నాయని కనుక తక్షణమే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయించేందుకు చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైవీ సుబ్బారెడ్డి హితవు పలికారు. జిల్లాలో 75శాతం కౌలు రైతులు ఉన్నా వారికి ఒక్క బ్యాంకరు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని దీంతో వ్యవసాయం అధ్వానంగా మారిందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి సాగు చేసుకుంటున్న చుక్కల భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేసి రైతాంగంలో నెలకొన్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పెట్టాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కందులకు సైతం రూ.45కోట్లు బకాయిలున్నాయని, అదే పచ్చచొక్కాల ఏజెంట్లు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రం వందశాతం నిధులు చెల్లించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వివక్షను ఎండగట్టేందుకే పాదయాత్ర: రాష్ట ప్రభుత్వం ప్రకాశం జిల్లా పట్ల కొనసాగిస్తున్న వివక్షను ఎండగట్టేందుకే ఈనెల 10వ తేదీ తరువాత వెలిగొండ ప్రాజెక్టు పరీవాహక ఐదు నియోజకవర్గాలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు. వెలిగొండ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుతుందని, కానీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చుండూరి రవి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, దామరాజు క్రాంతికుమార్, కేవీవీ ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, పులుగు అక్కిరెడ్డిలు పాల్గొన్నారు. -
కరువు కరాళ నృత్యం