సాక్షి, ప్రకాశం: చీరాలో వెలుగు చూసిన రెండు కరోనా పాజిటివ్ కేసుల వ్యక్తులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. (పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!)
కాగా ప్రస్తుతం వారి రిపోర్టులు రావాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెల్లోచ్చిన బృందంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. దీనిపై ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన పడొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి సూచించారు. (ఇంటికెళ్లాలని ఉంది: కనికా కపూర్)
Comments
Please login to add a commentAdd a comment