మర్రిపూడి:ప్రకాశం జిల్లా మర్రిపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు విచక్షణా రహితంగా కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఘటనలో బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పొదిలి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మర్రిపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 398లో 12.80 ఎకరాల భూమి ఉంది. పూరీ్వకుల నుంచి సంక్రమించిన ఈ భూమిని 1940వ సంవత్సరం నుంచి అదే గ్రామానికి చెందిన గొంటు వంశీకులైన గొంటు పెద యోగిరెడ్డి, గొంటు చినయోగిరెడ్డి, గొంటు వెంకట నర్శింహారెడ్డి, గొంటు శివారెడ్డి సాగుచేసుకుంటున్నారు.
అయితే, 1957వ సంవత్సరంలో జరిగిన రీ సర్వేలో గ్రామానికి చెందిన గొంటు వెంకటనర్శింహారెడ్డి, గొంటు శివారెడ్డి, చేరెడ్డి పెద కోటిరెడ్డి పేర్లు ఎఫ్‌ఎల్‌ఆర్‌లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన గొంటు శివారెడ్డి గతేడాది వైఎస్సార్ సీపీలో చేరారు. దీన్ని జీరి్ణంచుకోలేక కక్షకట్టిన టీడీపీ వర్గీయులు ఎఫ్‌ఎల్‌ఆర్ దాఖలాలో ఉన్న చేరెడ్డి పెదకోటిరెడ్డి వంశీకుడైన చేరెడ్డి పుల్లారెడ్డి సాగుచేసుకుంటున్న భూమిలో తమకు కూడా మూడో వంతు వాటా రావాలంటూ గొంటు వంశీయులకు నోటీసులు పంపించారు.
ఈ విషయంపై గురువారం స్థానిక శివాలయం వద్ద పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్న తరుణంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేరెడ్డి చిన్న నర్సారెడ్డితో పాటు వారి వర్గీయులు కలుగజేసుకుని వైఎస్సార్ సీపీ వర్గీయులపై కర్రలతో దాడి చేశారు. దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గొంటు శివారెడ్డి, గొంటు సుమాంజలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ పీ అంకమ్మరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment