AP POLYCET 2022: Hall Ticket, Exam Date And Time, Marks Details, Results, All You Need To Know - Sakshi
Sakshi News home page

AP Polycet 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి

Published Sat, May 28 2022 2:43 PM | Last Updated on Sat, May 28 2022 4:02 PM

AP POLYCET 2022: Hall Ticket, Exam Date, Time, Marks, Admit Card - Sakshi

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్‌–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్‌ పోల భాస్కర్‌ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ జరుగుతుందన్నారు. 

పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్‌ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. 

ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement