
సాక్షి, అమరావతి: ఏపీ పాలీసెట్–2025(AP POLYCET 2025)ను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరీక్షకు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచానా వేశారు.
దరఖాస్తు ఫీజు ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment