
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, డిస్కంలను పరిరక్షించేందుకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాల్సిందేనని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.రాష్ట్రంలో భారీగా పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు విద్యు త్ సరఫరా చేసేందుకు డిస్కంలు భారీగా వ్యయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేయనున్న ప్రతిపాదనలను ఆమోదించాలని రాష్ట్ర విద్యుత్ ని యంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి.
డిస్కంల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు విద్యుత్ రాయితీలు విడుదల చేయించాలని కోరాయి. గత నెల 29న ఈఆర్సీ నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం సమావేశంలో ఉద్యోగ, కార్మిక సంఘాల నేత లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని చార్జీల పెంపు తప్పనిసరని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో చర్చించిన విషయాల(మీటింగ్ మినిట్స్)ను ఈఆర్సీ బుధవారం బహిర్గతం చేసింది. డిస్కంల ప్రయోజనాల పరిరక్షణకు విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి అని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ అధ్యక్షుడు జి.సాయిబాబు సమావేశంలో డిమాండ్ చేశారు.
ఆర్థిక నష్టాల్లో ఉన్నామని డిస్కంల యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశాల్లో పేర్కొంటున్నా యని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు కె.ప్రకాశ్ తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచితే డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ (327) అధ్యక్షుడు ఈ.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకూ డి స్కంల వద్ద డబ్బులుండడం లేదని, వీటి కోసం కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment